బ్యాడ్​ బ్యాంకుల ఏర్పాటును పరిశీలిస్తాం

  • బ్యాడ్​ బ్యాంకులా.. చూద్దాం!
  • బ్యాంకులు క్యాపిటల్‌‌ను సేకరించుకోవాలి
  • కరోనా ప్రభావం ఫైనాన్షియల్‌ సంస్థలపై తీవ్రంగా ఉంది

న్యూఢిల్లీ: బ్యాడ్‌‌‌‌‌‌‌‌ బ్యాంకుల ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ వస్తే పరిశీలిస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శక్తికాంత దాస్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. 39 వ పాల్ఖివాలా మెమోరియల్‌‌‌‌‌‌‌‌ లెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా ఆయన మాట్లాడారు.  దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ముందుకురావాలని కోరారు. ‘ప్రస్తుతం అసెట్‌‌‌‌‌‌‌‌ రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీల(ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) ల కోసం రెగ్యులేటరీ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ ఉన్నాయి. బ్యాడ్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ఎవరైనా ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ సమర్పిస్తే వాటిని పరిశీలించడానికి ఓపెన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాం’ అని దాస్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. కాగా, బ్యాడ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ ఒక సంస్థ. ఫైనాన్షియల్ కంపెనీల నుంచి మొండిబాకీలను కొనుగోలు  చేసి వాటిని రికవరీ చేస్తాయి.

మరిన్ని చర్యలు తీసుకోవడానికి రెడీ

దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే అవసరమనుకుంటే మరిన్ని చర్యలు తీసుకోవడానికి సెంట్రల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ సిద్ధంగా ఉందని దాస్‌ చెప్పారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకుందని అన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తాము తీసుకొచ్చిన పాలసీలు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించాయనే విషయం అర్ధమవుతుందని అన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు బ్యాంకులు తమ అదనపు క్యాపిటల్‌‌‌‌‌‌‌‌(బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను పెంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా సంక్షోభం వలన బ్యాంకుల మొండిబాకీలు పెరిగే అవకాశం ఉందని, వీటి క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ కరిగిపోవచ్చని దాస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వ్యవస్థలో క్రెడిట్‌‌‌‌‌‌‌‌ ఫ్లోను కొనసాగించడానికి, అలానే ఆర్థిక వ్యవస్థ రికవరీ కావడానికి బ్యాంకులు అదనపు క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ను సేకరించడం చాలా కీలకమని పేర్కొన్నారు. ‘బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌షీట్లు, అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ, క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ అడెక్వసీ వంటి వాటిపై కరోనా సంక్షోభ ప్రభావం ఎంత వరకు ఉంటుందో ముందుగానే అంచనావేసుకోమని బ్యాంకులు, ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలకు  సలహాయిస్తున్నాం. సంక్షోభ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉన్న చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ను సేకరించాయి. మరికొన్ని బ్యాంకులు క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ను రైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌వేస్తున్నాయి.

ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీల రూల్స్‌‌‌‌‌‌‌‌ కఠినం కానున్నాయ్‌‌‌‌‌‌‌‌..

గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న నాన్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టేందుకు రూల్స్‌‌‌‌‌‌‌‌ను కఠినతరం చేయాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ వేస్తోంది. పెద్ద ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలు సరిపడినంత లిక్విడిటీని మెయింటెయిన్ చేసేలా  క్యాష్‌ రిజర్వ్‌ రేషియో రూల్‌ను తీసుకురావాలని సెంట్రల్‌ బ్యాంక్ చూస్తోందని అధికారులు చెప్పారు.

For More News..

ఫేస్‌‌‌‌ స్కాన్ చేసి దొంగల్ని పట్టేస్తున్నరు

పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన

మేయర్ సీటు కోసం లీడర్ల బిడ్డలు, కోడళ్ల లాబీయింగ్

Latest Updates