ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా

అనుకున్నదే అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఊర్జిత్ పటేల్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2016 సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలు తీసుకున్నారు. ఇన్నేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్ గా సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నా అన్నారు ఊర్జిత్. బ్యాంక్ సాధించాల్సిన లక్ష్యాలను అందుకోవడానికి…. ఆర్బీఐ స్టాఫ్, అధికారుల నుంచి అవసరమైన సహకారం అందిందని చెప్పారు. సహోద్యోగులు, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ లోని గవర్నర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా అన్నారు. భవిష్యత్తు అంతా బాగుండాలని ఆకాంక్షించారు ఊర్జిత్. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాల తర్వాత జరిగిన పరిణామాల కారణంగానే ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారని చెబుతున్నారు విశ్లేషకులు.

Posted in Uncategorized

Latest Updates