రెపో రేటును 25 పాయింట్లు తగ్గించిన RBI

భారత ఆర్థిక వృద్ధిరేటుకు ఊతం ఇచ్చేలా రిజర్వు బ్యాంకు(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల(గురువారం) ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గనుంది. దీంతో పరిశ్రమలు, వ్యక్తులకు ఇచ్చిన రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ తగ్గుతుంది. పరపతి విధాన సమీక్షలో ఇందుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది.ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీభారం తగ్గనుంది.

2019లో ఇప్పటికే రెండుసార్లు వడ్డీరేట్లను తగ్గించిన RBI, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మరోసారి వడ్డీరేట్లకు కోత పెట్టింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, అదే సమయంలో వృద్ధిరేటు తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను ఆర్బీఐ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతంగా ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది.

Latest Updates