ఇదిగో.. కొత్త 20 రూపాయల నోటు

RBI introduces new Rs.20 note

కొత్త రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను ప్రవేశపెట్టిన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోటును విడుద‌ల చేయనుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ నమూనా నోటును కూడా విడుదల చేసింది.

ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రంగులో ఉన్న ఈ నోటుపై ఒక వైపు మహాత్మాగాంధీ బొమ్మ, అశోకుడి స్థూపం, మరోవైపు ఎల్లోరా గుహ‌లు, స్వచ్ఛ భారత్‌ లోగో  ఉన్నాయి. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెలామ‌ణిలో ఉంటాయని ఆర్బీఐ అధికారులు చెప్పారు.

Latest Updates