రైతులకు తొందరగా అప్పివ్వాలి

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతులకు వెనువెంటనే రుణాలు జారీ అయ్యేలా అగ్రిటెక్ సంస్థలతో బ్యాంక్‌‌లు జత కట్టాలని ఆర్‌‌‌‌బీఐ ప్యానల్ ప్రతిపాదించింది. అగ్రికల్చర్‌‌‌‌ క్రెడిట్‌‌పై ఆర్‌‌‌‌బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్‌‌ రివ్యూ చేపట్టింది.  అగ్రికల్చర్ రంగానికి క్రెడిట్‌‌ను మెరుగుపరచడానికి పలు సూచనలు చేసింది. రైతులకు రూ.లక్ష వరకు వినిమయ రుణాలను బ్యాంక్‌‌లు ఇవ్వొచ్చని రిపోర్ట్ చెప్పింది. అయితే తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ రికార్డులను కరెక్ట్ సమయానికి డిజిటైజేషన్ ప్రాసెస్‌‌ను పూర్తి చేయాలని, అప్‌‌డేట్ చేయాలని తెలిపింది. బ్యాంక్‌‌లు ల్యాండ్ వివరాలను వెరిఫై చేసుకునేందుకు డిజిటైజేషన్ ల్యాండ్ రికార్డులు ఇవ్వాలని సూచించింది. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోవాలని, అగ్రిటెక్ కంపెనీలు, స్టార్టప్‌‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుని, రైతులకు సరైన సమయానికి క్రెడిట్ అందించే ఏర్పాటు చేయాలని ఈ ప్యానల్‌‌ తన రిపోర్ట్‌‌లో తెలిపింది.  మూవబుల్ వేర్‌‌‌‌హౌజ్‌‌లు, కోల్డ్ స్టోరేజ్‌‌లు, రైతులకు యంత్రాలను అద్దెకు అందించడానికి మొబైల్ ఆధారిత యాప్స్ ఇలా చాలా ఇన్నోవేషన్స్‌‌ అగ్రికల్చర్ రంగంలోకి వచ్చాయని, వీటిపై కేంద్రం దృష్టిసారించి, వాటిని దేశమంతటికీ తీసుకురావాలని చెప్పింది.

 జీఎస్టీ మాదిరి సిస్టమ్‌‌ కావాలి…

ఈ రివ్యూలో రుణ మాఫీదారులపై కాకుండా.. అగ్రికల్చర్‌‌‌‌లో  స్థిరత్వంపై ఫోకస్‌‌ చేయాలని తెలిపింది. జీఎస్టీ మాదిరి, అగ్రికల్చర్ రంగానికి కూడా ఒక అధికారిక బాడీ ఉండాలని ఈ ప్యానల్ ప్రతిపాదించింది. దీంతో అగ్రికల్చర్ రంగంలో క్రెడిట్‌‌ను మెరుగుపర్చవచ్చని రిపోర్టు పేర్కొంది. గోల్డ్‌‌పై ఇచ్చే రుణాలపై ఎక్కువ పరిశీలన ఉండాలని తెలిపింది. అగ్రికల్చర్ పాలసీలు, వాటి అమలు, ప్రస్తుత సబ్సిడీ పాలసీల సమర్థత, అగ్రికల్చర్‌‌‌‌కు ఇస్తున్న క్రెడిట్‌‌ వంటి విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పూర్తి సమీక్ష చేపట్టాలని ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్‌‌కు హెడ్‌‌ ఆర్‌‌‌‌బీఐ డిప్యూటీ గవర్నర్‌‌‌‌ ఎంకే జైన్ అన్నారు.

Latest Updates