రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ

  • మార్కెట్ లోకి లిక్విడిటీ పెంచే చర్యలు

ముంబై : కరోనా లాక్ డౌన్ కారణంగా డ్యామేజ్ అయిన ఆర్థిక వ్యవస్థ సెట్ రైట్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ లోకి లిక్విడిటీని పెంచేందుకు కీలక వడ్డీ రేట్లను సవరించింది. 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలల్లోనే ఆర్బీఐ మూడుసార్లు వడ్డీరేట్లను సమీక్షించింది. రెపో రెటు ను 4 .40 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం కంట్రోలోనే ఉందన్నారు. జీడీపీ మాత్రం ఈ ఏడాది నెగిటివ్ లోకి వెళ్లవచ్చని అంచనా వేశారు. అదే విధంగా బ్యాంక్ ల టర్మ్ లోన్లపై మరో మూడు నెలల మారటోరియం విధించారు. ఇప్పటికే మూడు నెలల మారటోయం ప్రకటించిన ఆర్బీఐ మరోసారి అవకాశం కల్పించింది. దీంతో ఆగస్టు వరకు లోన్లు కట్టకపోయినప్పటీ సిబిల్ స్కోర్ పై ఎఫెక్ట్ ఉండదు. విదేశీ మారక నిల్వలు కావాల్సినన్నీ ఉన్నాయన్న ఆయన కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. ఎగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకోవటంతో పాటు వర్కింగ్ కేపిటల్ పెంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని శక్తికాంత్ దాస్ చెప్పారు.

Latest Updates