మనీ ట్రాన్సుఫర్‌ చేసేవారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుండి అమల్లోకి

మనీ ట్రాన్సుఫర్‌ చేసేవారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. సాధారణంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేందుకు  రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం మినహాయించి మిగతా ఆఫీస్ రోజుల్లో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఉంటుంది. కానీ ఆ పద్దతిని ఆర్బీఐ మార్చేసింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ 24గంటలూ ఆర్టీజీయస్ ద్వారా మనీట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయాల్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో డిసెంబర్ 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఆర్టీజీఎస్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీజీఎస్ 365రోజులు, 24గంటల   సౌకర్యం కలిగిన ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందన్నారు.

Latest Updates