రేపు మూడు పోలింగ్ సెంటర్లలో రీ పోలింగ్

రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లోని మూడు బూత్‌లలో రేపు(శుక్రవారం) రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. టెండర్‌ ఓటు దాఖలు కావడంతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డిలోని 41వ వార్డు 101వ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ 32వ వార్డు 87 పోలింగ్‌ బూత్‌లో ..మహబూబ్‌నగర్‌లోని 41వ వార్డులో 198వ పోలింగ్‌  సెంటర్లలో రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు అధికారులు.

 

Latest Updates