ఈనెల 6న ఏపీలో 5 చోట్ల రీపోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల ఎన్నికల రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఈ రీపోలింగ్ జరగనుండగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో కేసానుపల్లి 94వ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 244వ కేంద్రం, నెల్లూరు జిల్లా పల్లపాలెం ఇసుకపల్లి 41వ కేంద్రం, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్ప 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కళనూతల 247వ కేంద్రంలో ఎన్నికలు జరగనున్నాయి.

 

Latest Updates