మానవాళిని కాపాడటానికి రెండు వ్యాక్సిన్‌‌లతో రెడీగా ఉన్నాం

న్యూఢిల్లీ: మానవాళిని కాపాడటానికి భారత్ రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌‌లతో సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌‌లో మోడీ వర్చువల్‌‌గా పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాసీయులతో మాట్లాడటం గొప్ప అవకాశమని మోడీ చెప్పారు. ‘కరోనా మృతులు తక్కువగా, రికవరీలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మానవాళిని రక్షించడానికి రెండు మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్‌‌లతో రెడీగా ఉన్నాం. ఈ కఠినమైన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ విధులను నిర్వర్తించిన తీరు మనందరికీ గర్వకారణం’ అని మోడీ పేర్కొన్నారు.

Latest Updates