వాలంటైన్ డే: ఇలా రెడీ అవ్వండి

వాలంటైన్ డే వచ్చేసింది. సాయంత్రం సరదాగా ప్రేమించిన వారితో పార్టీకో, డిన్నర్ కో ప్లాన్ చేసుకునే ఉంటారు చాలా మంది. కానీ ఏం వేసుకోవాలి, ఎలా వెళ్లాలి అనేది పెద్ద ప్రశ్న. అలాంటి వాళ్ల కోసమే ఈ టిప్స్.

సాయంత్రం వేళ పార్టీకి లేదా డిన్నర్ కి వెళ్లినప్పుడు కాస్త తేలికైన దుస్తులను ఎంచుకోవాలి. అలాగే లేత వర్ణంపై ముదురు గులాబీ రంగుంటే మరీ మంచిది.

ఎరుపు రంగు డ్రెస్ చేతులకు కోల్డ్ షోల్డర్ ఉంటే బాగుంటుంది. అలాగే పొడవాటి గౌన్లు కూడా ఈ సందర్భానికి బాగా నప్పుతాయి. ఇవి కూడా ఎరుపు లేదా ముదురు నీలంరంగులైతే బెటర్.

ఎరుపు రంగు డ్రెస్ వేసుకునప్పుడు హెవీ మేకప్ వద్దే వద్దు. డ్రెస్ కలర్ ఫుల్ గా ఉన్నప్పుడు హెవీ మేకప్ అంతగా సెట్ అవ్వదు. అలాగే లిప్ స్టిక్ ని కూడా వేసుకోకపోతే అందంగా కనబడతారు.

మెడలో చిన్న హార్ట్ షేప్ పెండెంట్ వేసుకుంటే హుందాగా ఉంటుంది. మీరు ప్రేమించే వారు కూడా స్పెషల్ గా ఫీల్ అవుతారు. హ్యాండ్ బ్యాగ్, పెండెంట్, చెప్పులు ఏదో ఒకటి హార్ట్ షేప్ లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు డ్రెస్ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది.

చీరకట్టులో మెరవాలంటే ఎరుపుని మించిన రంగు మరొకటి లేదు. చీర అంచున చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే బాగుంటుంది. హై హీల్స్ కూడా ఈ సందర్భానికి బాగా నప్పుతాయి.

Latest Updates