రియల్ వ్యాపారానికి రెక్కలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, డెవలప్ మెంట్ ఆథారిటీల రాకతో రియల్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. సిటీలో రేట్లు ఎక్కువగా ఉండటంతో అందరూ శివారు ప్రాంతాలవైపు చూస్తుండటంతో భారీగా వెంచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో తక్కువ ధరల్లోనే అనుకూలమైన స్థలాన్ని సొంతం చేసుకునే వీలు కలిగింది. అయితే క్లియర్ టైటిల్, లింక్ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయా లేదా చూసుకోవాలని.. కంపెనీ హిస్టరీ, ప్లాటింగ్ తీరు, రూల్స్ పాటించే వెంచర్లలోనే స్థిరాస్తిని కొనుగోలు చేయాలని నార్త్ ఈస్ట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గూడూరు జైపాల్ రెడ్డి ‘వెలుగు’తో చెప్పారు.

మిడిల్ క్లాస్ చూపు.. శివారు వైపు

ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దాదాపు 30–80 కి.మీ. పరిధిలో వందల ఎకరాల్లో ఓపెన్ ప్లాటింగ్ వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిలో ఎక్కువగా పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతో జీపీ ప్లాట్లను కూడా రెగ్యులరైజ్ చేసుకునే వీలు ఉంది. సిటీ నుంచి దాదాపు 100 కి.మీ పరిధిలో అభివృద్ధి తీరు గత పదేళ్లతో పోలిస్తే రెండింతలు వేగంగా మారింది. శివారులోని గ్రామాల వరకు మౌలిక వసతులు, రోడ్లు, రవాణా, కార్పొరేట్ స్కూళ్లు, హాస్పిటల్స్ అందుబాటులోకి రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు  పెరిగాయి. దీంతో సిటీకి కాస్త దూరమైనా కనీసం ఓపెన్ ప్లాట్ అయినా కొనాలనే భావన ఎక్కువైంది. మిడిల్ క్లాస్ కు అందుబాటులో ఉండేలా వెంచర్లు ప్రారంభిస్తున్నాం.

వైటీడీఏ ఏర్పాటుతో మారిన రియల్ తీరు

యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ ఆథారిటీ (వైటీడీఏ) ఏర్పాటుతో ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ హైవే వెంబడి రియల్ వ్యాపారం భారీగా పుంజుకుంది. ఎక్కువగా జీపీ లే అవుట్లు అందుబాటులో ఉండగా…ఇటీవల కాలంలో డీటీసీపీ ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోంది. ఇటు విజయవాడ హైవే మార్గంలో ఉన్న చౌటుప్పల్ వరకు ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే అయిపూర్ వద్ద భారీ వెంచర్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చాం.
మా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించే ప్రతి ప్రాజెక్టులో డీటీసీపీ తరహా నిబంధనలు పక్కాగా అమలు చేస్తాం. ముఖ్యంగా కొనుగోలుదారుడికి ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్లను అనుకున్న టైం కంటే ముందుగానే అందించడంతోపాటు వన్ టైం రిజిస్ట్రేషన్, వెంచర్లలో ప్లాంటేషన్ మొత్తం కంపెనీయే చూసుకుంటుంది. మొక్కలు పెరిగి దిగుబడి రావడానికి కనీసం మూడేళ్లు అయినా పడుతుంది. అప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్లాంట్ల మెయింటెనెన్స్ చేస్తున్నాం. వచ్చే ఆదాయంలో 50శాతం మేర ప్లాట్ ఓనర్లకే కార్పస్ ఫండ్ లా ఇస్తున్నాం.

150 గజాల ప్లాట్లు బెస్ట్​…

చిన్న సైజ్ ప్లాట్లతో వినియోగదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా చెల్లింపులు, తక్కువ ధరల్లోనే దొరుకుతుండటంతో వాయిదా పద్ధతుల్లో చెల్లింపులు జరిపినా ఆర్థికంగా భారం ఉండదు.ప్రస్తుతం రెంటల్ వ్యాల్యూ కంటే తక్కువ ఉండటంతో 150 గజాల్లో ఉండే ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం.

Latest Updates