నగరంలో ఊపు మీదున్న ‘రియల్’ వ్యాపారం

Real estate business growing in hyderabad city
  • హైదరాబాద్​ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో దేశంలోనే టాప్
  • ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ ధరలకే రెసిడెన్షియల్ మార్కెట్
  • వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో పాటు బెస్ట్ సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
  • సిటీ గ్రోత్ లో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్.. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ. నాలుగేళ్లుగా దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా కొనసాగుతున్న నగరం. గ్లోబల్ సిటీగా మారడానికి అన్ని అర్హతలున్న హైదరాబాద్ గ్రోత్​లో రియల్ ఎస్టేట్ కీ రోల్ పోషిస్తోంది. కమర్షియల్ స్పేస్ లో దేశంలోనే టాప్ లో ఉన్న మన సిటీ రెసిడెన్షియల్ మార్కెట్లో ది బెస్ట్ గా నడుస్తోంది.

భాగ్యనగరం కార్పొరేట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో ముందుంది. నాలుగేళ్లుగా అన్నిరకాలుగా డెవలప్ అవుతూ ముందుకెళ్తోంది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరంగా ది బెస్ట్ అనిపించుకుంటోంది. ఇన్ని ఉన్న సిటీలో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. మిగతా సిటీస్ తో పోలిస్తే అఫర్డబుల్ రేట్ లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్ ఇక్కడ ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి బ్లూచిప్ కంపెనీలతో పాటు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, క్యాప్ జెమ్ని వరల్డ్ టాప్ ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో తమ తమ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే అమెరికాకి చెందిన కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపెనీ అడోబ్ సిస్టమ్స్ కూడా ఇక్కడ తమ సెంటర్ ని ఏర్పాటు చేసుకొనే ప్లాన్ లో ఉంది. వీటన్నింటితోపాటు వందల సంఖ్యలో ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. సుమారు ఐదులక్షల మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తుండగా పరోక్షంగా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు.

బెంగళూరు ఒకప్పుడు.. ఇప్పుడు మనదే    

ప్రస్తుతం కమర్షియల్ స్పేస్ వినియోగంలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్​లో మన సిటీ ఉంది. ఇన్నాళ్లు టాప్​లో ఉన్న బెంగళూరుని వెనక్కి నెట్టేసి ఫస్ట్​ప్లేస్​కు వెళ్లింది. దేశవిదేశాల నుంచి ఐటీ కంపెనీలతో పాటు స్టార్టప్స్ ఇక్కడికి క్యూ కడుతుండటంతో కమర్షియల్ మార్కెట్ పెరిగిపోయింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి వెస్ట్రన్ సిటీలో అయితే ఆఫీస్ స్పేస్ కి భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఎస్ఈజెడ్ లలో తమ సంస్థలను ఏర్పాటు చేసుకుంటే, ఇంకొన్ని సొంతగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు మాత్రం కమర్షియల్ సెంటర్స్ లో లీజుకి తీసుకొని లేక రెంట్ కి తీసుకుని నడిపిస్తున్నాయి. మిగతా సిటీస్ తో పోలిస్తే చేస్తే అఫర్డబుల్ ప్రైస్ లో అన్ని వసతులతో స్పేస్ లభించడంతో ఇక్కడి ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరిగిందంటున్నారు డెవలపర్స్.

ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నారు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో ఇక్కడి రెసిడెన్షియల్ మార్కెట్ పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, డిమాండ్ ని తీర్చడానికి అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ది బెస్ట్ లివింగ్ సిటీగా నాలుగేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. వెదర్ పరంగా, డెవలప్ మెంట్ పరంగా ముందుండటంతో చాలా మంది ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇది కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ని పెంచుతూ వస్తోంది. ఇక్కడ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ తో పాటు కాస్మోపాలిటన్ కల్చర్ ఉండటంతో రెసిడెన్షియల్ మార్కెట్ పెరిగింది. మెట్రో నగరాలు కాని జైపూర్, పుణె, నాగ్​పుర్ వంటి సిటీలతో పోల్చినా ఇక్కడ రెసిడెన్షియల్ రేట్లు తక్కువగా ఉన్నాయి.

ఓఆర్ఆర్​ పెద్ద అసెట్​

ఇక హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సిటీకి మరో పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ కూడా రియల్ఎస్టేట్ జోష్ లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ కి వచ్చే ఇండస్ట్రీస్ ఎక్కువగా రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటవుతున్నాయి. అలాగే సిటీలో రెసిడెన్షియల్ మార్కెట్ కి డిమాండ్ పెరిగి రేట్స్ కూడా పెరగడంతో సిటీ శివార్లకు పాకింది. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగుండటం ఒక మంచి అంశంగా చెప్పొచ్చు.

– అశ్విన్, డెవలపర్

Latest Updates