కేటీఆర్, ర‌జనీకాంత్ కు స‌వాల్ విసిరిన చిరంజీవి

లాక్ డౌన్ కారణంగా గ‌త కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన మ‌గ‌వాళ్లు.. ఇంట్లో ఆడవారికి సాయంగా ఉండాలనీ.. ఎవరైతే ఈ కష్టకాలంలో ఆడవారికి తోడుగా ఉంటారో వారే అసలైన మగవారని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ విసిరిన ‘బి ది రియల్ మెన్ ఛాలెంజ్’ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ద‌ర్శక ధీరుడు ‌రాజమౌళి, జూ.ఎన్టీఆర్, కీరవాణి, సుకుమార్ లు ఇప్ప‌టికే ఈ ఛాలెంజ్ లను చేశారు. ఎన్టీఆర్ ఇటీవలే ఈ ఛాలెంజ్ లో పాల్గొని మెగాస్టార్ చిరంజీవికి ఛాలెంజ్ ను విసిరాడు.
జూనియర్ ఎన్టీఆర్ విసరిన సవాల్ ని స్వీకరించిన చిరంజీవి ఇంటి పనులు చేశారు. వాక్యూమ్ క్లీనర్‌తొ ఇల్లు శుభ్రం చేశారు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి పెస‌రట్టు వేసి, తన తల్లి అంజనాదేవికి అందించారు. ఈ సందర్భంగా అంజనాదేవి.. చిరుకు పెసరట్టు తినిపించారు. ఆ తర్వాత ఆమె కూడా తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోని చిరంజీవి పోస్ట్ చేశారు.
ఆ తర్వాత నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ మంత్రి కేటీఆర్, తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఛాలెంజ్ విసిరారు.

Latest Updates