మార్కెట్లోకి రియ‌ల్ మి 3 స్మార్ట్‌ ఫోన్

రియ‌ల్ మి 3 డైన‌మిక్ బ్లాక్‌, రేడియెంట్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడులైంది. ఈ ఫోన్‌ కు చెందిన 3GB ర్యామ్‌, 32GB స్టోరేజ్ వేరియెంట్ ను రూ.8,999 ధ‌రకు, 4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్ వేరియెంట్ ను రూ.10,999 ధ‌ర‌కు అందివ్వ‌నున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్‌ కార్ట్‌ తోపాటు రియ‌ల్ మి ఆన్‌ లైన్ స్టోర్‌ లో ఈ ఫోన్‌ ను అమ్ముతారు  మొద‌టి ఫ్లాష్ సేల్‌ లో ఈ ఫోన్‌ ను HDFC కార్డులు ఉప‌యోగించి కొనుగోలు చేస్తే రూ.500 ఇన్‌ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఇదే ఫోన్‌ కు చెందిన ప్రొ వేరియెంట్‌ ను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

రియ‌ల్ మి 3 ఫీచ‌ర్లు…

6.2 ఇంచ్ HD ప్ల‌స్ IPS డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 GBర్యామ్‌, 32/64 GB స్టోరేజ్‌, 256GB ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4G VOLTE , బ్లూటూత్ 4.2, 4230 MAH బ్యాట‌రీ.

 

Latest Updates