షాపుల్లో అమ్మకాలపై ఫోకస్

హైదరాబాద్,వెలుగు : రియల్‌ మీ బ్రాండ్ ఆఫ్‌‌‌‌లైన్లో కూడా తమ అమ్మకాలను మరింత పటిష్టపరుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇండియాలో ఆన్‌లైన్ ద్వారా 11 నెలలుగా స్మార్ట్‌‌‌‌ఫోన్ల అమ్మకాలు సాగిస్తున్న రియల్‌ మీ జనవరి నుం డి ఆఫ్‌‌‌‌లైన్ అమ్మకాలపై కూడా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఏడాదిలోగా 150 సిటీల్లో 20 వేల ఔట్‌‌‌‌లెట్లలో అమ్మకాలు సాగించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సరైన పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌ను ఎంచుకోనున్నట్లు రియల్‌ మీ ఇండియా ఆఫ్‌‌‌‌లైన్ సేల్స్ హెడ్ దీపేశ్ పునామియా తెలిపారు.ప్రస్తుతం 35 సిటీల్లో 3000 వేలకు పైగా స్టోర్లున్నాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 5 సర్వీస్‌ సెంటర్లుండగా 90 రియల్ పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌ ఉన్నారని, మే చివరికల్లా 250 మంది పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌ను చేర్చుకుంటామని వెల్లడించారు. సర్వీస్ సెంటర్లు లేనిచోట కాల్ మీ సర్వీస్ పేరిట సేవలందిస్తున్నామని చెప్పారు. దీన్లో కాల్‌ సెం టర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఫోన్ తీసుకుని రిపేర్ చేసి తిరిగి ఇంటివద్ద ఇచ్చే సదుపాయాన్ని  అందిస్తున్నట్లు పునామియా తెలిపారు.

త్వరలో రియల్‌ మీ 3ప్రో ఫోన్‌ ను లాం చ్ చేస్తామని అన్నారు. ఈ ఏడాదిలో మొత్తంగా 6 కొత్త మోడల్స్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జనవరి నాటికి 50 లక్షలకు పైగా ఫోన్ల అమ్మకాలు జరిగాయని, తమ ఫోన్లు రూ.7 వేల నుం డి రూ.17 వేల మధ్య అందుబాటులో ఉన్నాయని అన్నారు. రూ.10 వేల లోపు స్మార్ట్‌‌‌‌ఫోన్ల అమ్మకాల్లో రియల్‌ మీ మొదటి స్థా నంలో ఉందని చెప్పారు.

Latest Updates