గేమింగ్ లవర్స్ కోసం రియల్‌ మీ 3 ప్రో రిలీజ్

న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్‌ మీ తనతొలి వార్షికోత్సవం సందర్భంగా రెండు సరికొత్తస్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. గేమింగ్‌‌ లవర్స్‌‌ కోసం అత్యాధునిక టెక్నాలజీలతో ‘రియల్‌ మీ 3 ప్రొ’ను,బడ్జెట్‌ యూజర్ల కోసం ‘రియల్‌ మీ సీ2’ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వీటిని ఆవిష్కరించింది. రియల్‌ మీ సీ2ను డైమండ్ కట్ డిజైన్‌ తో తయారుచేయడం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

2జీబీర్యామ్ +16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.5,999. 3జీబీ ర్యామ్ +32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999. ఇది వ చ్చే నెల15 నుంచి ఫ్లిప్‌‌కార్ట్‌‌డాట్‌ కామ్, రియల్‌ మీ డాట్‌ కామ్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. రియల్‌ మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్‌ను శక్తిమంతమైన ప్రాసెసర్‌ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710తో తయారు చేశారు. ఇందులో 4జీబీ ర్యామ్ +-64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇది ఈ నెల 29 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్‌ మీ.కామ్ల లో అందుబాటులో ఉంటుంది.

4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ వేరియంట్ ధర రూ.16,999. ఈ సందర్భంగా రియల్‌ మీ సీఈవో మాధవ్ సేఠీ మాట్లాడుతూ.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఔట్‌ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి తమ టెక్నాలజీలను అప్ గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి ఆరు కోట్ల యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ గ్రేటర్ నోయిడాలో ఉందని, హైదరాబాద్ ఆర్అండ్డీ సెంట ర్ లో 400 మంది పని చేస్తున్నట్టు వెల్లడించారు. రియల్‌ మీ బ్రాండ్ లాంచ్ అయిన 11నెల ల్ లో నే 65 ల క్షల అభిమానులను తమ సొంతం చేసుకోగలి గామని చెప్పారు. 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చే అవ కాశాలున్నా యా..? అనే ప్రశ్నకు ప్ర-స్తుతానికి అలాంటి ఫోన్లను తయారు చేయడం లేదనిమాధవ్‌‌ అన్నారు.

రియల్ మీ 3 ప్రో ఫీచర్లు…

 • 6.3 ఫుల్ హెచ్ స్క్రీన్
 • వోక్ ఫ్లాష్ చార్జింగ్‌
 • స్నాప్ డ్రాగ న్ 710 ప్రాసెసర్‌
 • 16 ఎంపీ+5 ఎంపీ రియ ర్ కెమెరా
 • 25 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా
 • 4,045 ఎంఏహెచ్ ఏఐ బ్యాట రీ
 • ఆండ్రాయిడ్ 9.0 ఆధారిత క ల ర్ ఓఎస్ 6.0

రియల్‌ మీ సీ2 ఫీచర్లు

 • 6.1 హెచ్ డీ ప్లస్ ఫుల్ స్క్రీన్
 • హీలియో పీ22 ప్రాసెసర్‌
 • 13ఎంపీ+2 ఎంపీ డ్యూయ ల్ కెమెరా
 • 5 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా
 • క ల ర్ ఓఎస్ 6.0+ఆండ్రాయిడ్ 9.0
 • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Latest Updates