రియల్ మీ 3i .. బడ్జెట్ లో కొత్త ఫోన్

రియల్ మీ కంపెనీ కొత్త ప్రొడక్ట్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన రియల్ మీ X తో పాటే… రియల్ మీ 3i ను కూడా లాంచ్ చేస్తోంది.

Realme 3i స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. 3 జీబీ ర్యామ్/32 జీబీ రోమ్… 4 జీబీ ర్యామ్/64 జీబీ రోమ్ అనే రెండు వేరియంట్లను తీసుకొచ్చారు.

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే. 4,230 mAh బ్యాటరీ, మీడియా టెక్ హెలియో 610 చిప్ సెట్ , ఆండ్రాయిండ్ P కలర్ ఓఎస్6, 6.2 అంగులా డ్యూడ్రాప్ ఫుల స్క్రీన్ డిస్ ప్లే,  దీని అదనపు ఫీచర్లు.

13 మెగా పిక్సెల్ బ్యూటీ సెల్ఫీ కెమెరా, 13+2మెగా పిక్సెల్ రేర్ ఆల్ డ్యూయల్ కెమెరాలను ఈ ఫోన్ లో పొందుపరిచారు.

డైమండ్ బ్లాక్, డైమండ్ బ్లూ, డైమండ్ రెడ్ రంగుల్లో ఫోన్లు తయారుచేశారు.

3జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.7,999/-

4జీబీ/48జీబీ వేరియంట్ ధర రూ.9,999/-.

ఈ ఫోన్లు జులై 23 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్ లైన్ స్టోర్స్ లో అందుబాటులోకి వస్తున్నాయి.

Latest Updates