రియల్ మీ X యూత్ ఎడిషన్

Realme X and Realme X Youth Edition are set to launch on may 15

రియల్ మీ తన కొత్త ఫోన్లను విడుదల చేయబోతోంది. రియల్ మీ X , రియల్ మీ X యూత్ ఎడిషన్ అనే ఫోన్లను ఈ నెల 15 న చైనాలో విడుదల చేయబోతుంది.  చైనా రెగ్యులేటర్ TENAA వెబ్ సైట్ ఈ ఫోన్లకు సంబంధించిన విశేషాలను, స్పెసిఫికేషన్లను వెల్లడించింది.  రియల్ మీ X 48-మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ ను కలిగి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ మధ్యకాలంలో వచ్చిన దాదాపు అన్ని ఫోన్లలో సెన్సార్ చాలా పాపులర్ అయింది. ఇదే బేస్ చేసుకొని తమ కంపెనీ రూపొందించిన ఈ ఫోన్  6.5 అంగుళాల పొడువు, డిస్ ప్లే పై  ఫింగర్ ప్రింట్  సెన్సార్, 3,680 mAh బ్యాటరీ  ఉంటుందని తెలిపింది. అదే విధంగా రియల్ మీ X యూత్ ఎడిషన్,  6.3-అంగుళాల పొడువు, 6 GB RAM అని తెలిపింది.

రియల్ మీ X స్పెసిఫికేషన్ (అంచనా)

అండ్రాయిడ్ పై OS 6.0,

6.5 ఇంచెస్  స్క్రీన్

ఫుల్ హెచ్ డి (1080×2340 పిక్సెల్స్) AMOLED డిస్ ప్లే

మోడల్ నంబర్ RMX1901

ఆక్టా కోర్ ప్రాసెసర్ 2.2GHz

4GB RAM.

ఇంటర్నెల్ స్టోరేజీ 64GB

Realme X 48-మెగాపిక్సెల్ మరియు 5-మెగాపిక్సెల్  రేర్ సెన్సార్లను మరియు 16-మెగాపిక్సెల్ పాప్-అప్  సెల్ఫీ సెన్సర్ ను కలిగి ఉంటుందని TENAA తెలిపింది. ఇది బ్లాక్-బ్లూ, మరియు వైట్ రంగు ఎంపికలు చైనాలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. 3,680mAh బ్యాటరీతో మార్కెట్ లో లభ్యం కానుంది.

రియల్ మీ X యూత్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఈ ఫోన్ మోడల్ నంబర్ RMX1851

సైజు 6.3-అంగుళాలు

ఫుల్ హెచ్ డి  (1080×2340 పిక్సెల్స్) IPS LCD డిస్ ప్లే

4GB RAM + 64GB స్టోరేజ్  మరియు 6GB RAM + 128GB స్టోరేజ్  ఆప్షన్లు ఉన్నాయి.

Realme X యూత్ ఎడిషన్ 16-మెగాపిక్సెల్ మరియు 5-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మరియు 25-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.

Latest Updates