బీజేపీలో చేరిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా

rebel-aap-leader-kapil-mishra-disqualified-by-delhi-speaker-joins-bjp

మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా బీజేపీలో చేరారు. కపిల్ మిశ్రాతో పాటు ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రీచాపాండే ఢిల్లీలోని బీజేపీ  కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఢిల్లీలోని కార్వాల్ నగర్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలిచిన కపిల్ మిశ్రా లోక్ సభ ఎన్నికల్లో ఆప్ కు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అతడిపై అనర్హత వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో చేరతారనే ప్రచారం  జరగగా ఇవాళ (శనివారం)పార్టీలో చేరారు కపిల్ మిశ్రా.

Latest Updates