పాక్ కు వెళ్లే ముందు ఆలోచించండి: అమెరికా

reconsider travel to Pakistan due to terrorism, says america

reconsider travel to Pakistan due to terrorism, says americaవాషింగ్టన్: పాకిస్థాన్ కు ప్రయాణించాలనుకునే వాళ్లు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అమెరికా సూచించింది. పాక్ ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా అక్కడికి వెళ్లకపోవడం మేలని చెప్పింది. పుల్వామాలో పాక్ బేస్ గా నడిచే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ దాడి చేసి 42 మంది జవాన్ల ప్రాణాలు తీసిన నేపథ్యంలో అమెరికా పౌరులకు ఆ దేశ విదేశాంగ శాఖ పై విధంగా సూచన చేసింది.

ఉగ్రవాదాన్ని సహాయం ఆపేయండి

పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకోవాలని అమెరికా మరోసారి హెచ్చరించింది. వెంటనే ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం నిలిపేయాలని సూచించింది. పాక్ భూభాగం నుంచి నడుస్తున్న టెర్రరిస్టు స్థావరాలే ఆసియాలో హింసకు కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Latest Updates