డిశ్చార్జ్‌లలో రికార్డ్.. ఒక్కరోజులోనే 70 వేల మంది డిశ్చార్జ్

దేశంలో కరోనావైరస్ నుంచి ఒకే రోజులో రికార్డు స్థాయిలో 70,000 మందికి పైగా డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ‘సెప్టెంబరు 5న అత్యధికంగా 70,072 రికవరీలు నమోదయ్యాయి. ప్రస్తుతం రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. అదేవిధంగా మరణాల రేటు 1.73 శాతంగా ఉంది’ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 3న 68,584 రికవరీలు, సెప్టెంబర్ 1న 65,081 మరియు ఆగస్టు 24న 57,469 రికవరీలు నమోదయ్యాయి. కరోనా రికవరీలలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. మేలో 50 వేలుగా ఉన్న రికవరీలు.. సెప్టెంబరులో 30 లక్షలకు చేరుకోవడంతో మొత్తంగా రికవరీల సంఖ్య 31 లక్షలు దాటిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో నమోదయిన మొత్తం రికవరీలలో ఐదు రాష్ట్రాలలో రికవరీ శాతం ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 21 శాతం, తమిళనాడులో 12.63 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 11.91 శాతం, కర్ణాటకలో 8.82 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.14 శాతం నమోదైంది. దేశంలో ప్రస్తుతం 8,46,395 యాక్టివ్ కేసులుండగా.. 22.6 లక్షలకు పైగా రికవరీలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

For More News..

దొంగతనం చేసిండని కట్టేసి తమ సరదా తీర్చుకున్రు

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే

Latest Updates