జమ్మూలో రికార్డ్ బ్రేక్ వర్షం

50.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

20 ఏండ్లలో జనవరిలో ఇదే సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భారీగా కురుస్తున్న మంచు, రోడ్లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జమ్మూ: జమ్మూలో బుధవారం ఉదయం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 24 గంటల్లో 50.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 20 ఏండ్లలో ఇది సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్షపాతం అని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసిందన్నారు. వర్షం కారణంగా తావీ నది విపరీతంగా ప్రవహిస్తోందని తెలిపారు. మరోవైపు ఆదివారం నుంచి కురుస్తున్న మంచు వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా మంచు కురుస్తుండటంతో జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేను అధికారులు వరుసగా మూడోరోజు మూసేశారు. దీంతో జమ్మూ – శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండువైపుల వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీగా ఆగిపోయాయి. “ మంచు ఎక్కువగా కురవడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో హైవేను మూసేశాం. మంచును క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం” అని అధికారులు చెప్పారు. మంచు వర్షం కారణంగా వరుసగా నాలుగో రోజు ఫ్లైట్లు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకే పరిమితమయ్యాయి. కుల్గామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అత్యధికంగా నాలుగు నుంచి ఆరు ఫీట్ల మంచు కురిసిందని అధికారులు
వెల్లడించారు.

సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మృతి

మంచు కారణంగా సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జవాను, 74 ఏండ్ల అవ్వ మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. అధిక మంచు కురవడంతో కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూలి115 బెటాలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోయాడు. మంచు కారణంగా కుప్వారా జిల్లాకు చెందిన  రహీమా అనే వృద్ధురాలు చనిపోయినట్లు చెప్పారు.

ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి

సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్

Latest Updates