ప్లేయర్లను ఆకట్టుకుంటున్న కొత్త వీడియో గేమ్

న్యూయార్క్‌:  రకరకాల పేర్లతో ఆన్ లైన్ గేమ్స్ పుట్టుకొస్తుండగా..లేటెస్ట్ గా మరో గేమ్ హల్ చల్ చేస్తోంది. దీని పేరు అపెక్స్‌ లెజెండ్స్‌. అమెరికాకు చెందిన వీడియో గేమ్‌ డెవలప్‌ మెంట్‌ స్టూడియో రెస్పాన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఈ గేమ్‌ను రూపొందించింది. ఇది ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌ (EA) అనుబంధ సంస్థ. గేమ్‌ మార్కెట్‌ లోకి వచ్చిన మూడు రోజుల్లోనే కోటి మంది ప్లేయర్లను ఆకట్టుకుంది.

అపెక్స్‌ లెజెండ్స్‌ ప్లేయర్ల సంఖ్య ఇప్పటికే రెండు కోట్లకు పైగా దాటింది. 10 లక్షల మంది ఒకేసారి గేమ్‌ లోకి లాగిన్‌ అవుతున్నారని తెలిపింది EA. శుక్రవారం వరకు లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియో ప్లాట్‌ ఫామ్‌ ట్విచ్‌ లో ఎక్కువ మంది వీక్షించిన గేమ్‌ ఇదే. అపెక్స్‌ గేమ్‌ ను ఎక్స్‌ బాక్స్, PS4, పీసీల్లోనే ఆడుకోవచ్చు. దీన్ని మొబైల్‌ వెర్షన్‌ త్వరలో మార్కెట్‌ లోకి వచ్చే అవకావముందని చెబుతున్నారు.

 

Latest Updates