రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

గ్రేటర్లో 1,658 మందికి పాజిటివ్.. మరో 8 మంది మృతి
ప్రకటించని కేసులు 3 వేలకు పైనే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం 1,213 కేసులు నమోదవగా.. శుక్రవారం అత్యధికంగా 1,892 మందికి వైరస్ పాజిటివ్‌ వచ్చింది.శుక్రవారం నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1,658 వచ్చాయి. జిల్లాల్లో 234 మందికి పాజిటివ్ వచ్చింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,462కు పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే, మరో 3 వేలకు పైగా కేసులకు బులెటిన్‌లో చోటు దక్కలేదు. ఇందులో ఒకే ల్యాబులో చేసిన 2,672 కేసులు ఉన్నాయి. ఈ ల్యాబులో 3,726 మందికి టెస్ట్ చేస్తే.. 2,672 మందికి పాజిటివ్ వచ్చిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ల్యాబులో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉన్నందున.. టెస్టుల్లో తప్పులు ఏమైనా జరిగాయేమో చూసిన తర్వాతే కేసుల సంఖ్య ప్రకటిస్తామని అన్నారు. రాత్రి 9 గంటల టైమ్ తో రిలీజ్ చేసిన బులెటిన్ లో, అప్పటికే నమోదైన మరో ఆరొందలకు పైగా కేసులను కలపలేదు. ఇవన్నీ కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,700 దాటుతుంది. శుక్రవారం కరోనాతో 8 మంది చనిపోయినట్ల వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 283కు పెరిగింది. మొత్తం బాధితుల్లో 9,984 మంది కోలుకోగా, యాక్టివ్ కేసులు 10,195 ఉన్నట్లు బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

లక్షకు చేరిన టెస్టులు
రాష్ట్రంలో టెస్టుల సంఖ్య లక్షకు చేరింది. శుక్రవారం 5,965 టెస్టులు చేయగా, టెస్ట్ చేసిన ప్రతి వందలో 31.71 శాతం మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. మొత్తం టెస్టుల సంఖ్య 1,04, 118కు చేరింది. ఇందులో 19.65 శాతం మందికి పాజిటివ్ వచ్చింది.

జిల్లాల్లోనూ టెస్టులు
నిజామాబాద్, గద్వాల, కొత్తగూడెం, కరీంనగర్, సూర్యాపేట, ఆసిఫాబాద్, మెదక్ జిల్లా ఆస్సత్రుల్లో కరోనా టెసుట్లకు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. ఆయా ఉమ్మడి జిలాల్ల శాంపిళ్లను అక్కడే టెస్టులు చేయనున్నారు. ఏ జిల్లా శాంపిళ్లను ఎక్కడికి పంపించాలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో 837 కొత్త కేసులు.. 8 మంది మృతి
ఏపీలో శుకర్వారం ఒక్కరోజే 38,898 మందికి టెస్టులు చేయగా 837 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఏపీకి చెందినవారు 789 ఉండగా, వేరే సేట్ట్స్ నుంచి వచ్చిన 46 మంది, ఫారిన్ నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,934కు చేరింది. 8 మంది చనిపోయారు. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 206కు చేరింది.

For More News..

‘పూజిస్తం.. అవసరమైతే శిక్షిస్తం’

ప్రజల ప్రాణాల కంటే ఆన్ లైన్ క్లాసులు ముఖ్యమా?

Latest Updates