రికార్డులు ధోనీవైపే ఉన్నా.. కుంబ్లేనే  బెస్ట్​ కెప్టెన్​

న్యూఢిల్లీ:  రికార్డులు మహేంద్ర సింగ్​ధోనీ వైపే ఉన్నా.. తాను ఆడిన వారిలో లెజెండరీ స్పిన్నర్​ అనిల్​ కుంబ్లేనే బెస్ట్ కెప్టెన్​ అని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ చెప్పాడు. ఇండియా కెప్టెన్లుగా ధోనీ, సౌరవ్​ గంగూలీపై తనకు గౌరవం ఉన్నప్పటికీ.. కుంబ్లేనే అద్భుతమైన నాయకుడని, జట్టును అతను చాలా కాలం నడిపించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘రికార్డులు ధోనీ వైపే ఉన్నాయని ఒప్పుకోవాల్సిందే. అతను ఐసీసీ ట్రోఫీలన్నింటినీ సాధించాడు. కెప్టెన్​గా అద్భుతంగా రాణించాడు. లాంగ్​టైమ్​ ప్రెజర్​ను హ్యాండిల్​ చేశాడు. సౌరవ్​ కూడా చాలా సాధించాడు. అయితే, ఇండియాకు లాంగ్​టైమ్​ కెప్టెన్​గా ఉండాల్సిందని నేను కోరుకునే ఏకైక వ్యక్తి  అనిల్​ కుంబ్లే. అతని కెప్టెన్సీలో నేను ఆరు టెస్టు మ్యాచ్​లు ఆడా.  కుంబ్లే ఎక్కువ కాలం కెప్టెన్​గా కొనసాగి ఉంటే మాత్రం చాలా రికార్డులు బ్రేక్​ చేసేవాడు’ అని చెప్పుకొచ్చాడు.

Latest Updates