హాస్పిటల్ నుంచి మధులిక డిశ్చార్జ్

నారాయణగూడలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన ఇంటర్ అమ్మాయి మధులిక ఇవాళ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లనుంది. ఈ మధ్యాహ్నం 12 గంటల టైమ్ లో .. మలక్ పేట్ యశోద హాస్పిటల్ నుంచి… డిశ్చార్జ్ కానుంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో… ఐసీయూనుంచి స్టెప్ డౌన్ గదిలోకి షిఫ్ట్ చేశారు. ఇటీవలే జ్వరం రావడంతో.. యాంటీబయోటిక్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. అబ్జర్వేషన్ తర్వాత… ఇంటికి వెళ్లొచ్చని డాక్టర్లు కుటుంబసభ్యులకు సూచించారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మధులికకు కొన్నాళ్లపాటు చికిత్స కొనసాగనుంది.

Latest Updates