8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రిక్రూట్‌‌మెంట్‌‌

కొలువులు ఆగలె

బీ-స్కూల్స్‌‌లో బోలెడు జాబ్స్‌‌

న్యూఢిల్లీ: కరోనా వల్ల బిజినెస్‌‌లు దెబ్బతింటున్నప్పటికీ, కంపెనీలు మాత్రం బిజినెస్‌‌ స్కూల్స్‌‌ గ్రాడ్యుయేట్స్‌‌కు జాబ్స్ ఇవ్వడాన్ని తగ్గించలేదు. మరింత పెంచాయి కూడా. ఇండియా మేనేజ్‌‌మెంట్స్ స్కూల్స్‌‌లో రిక్రూట్‌‌మెంట్‌‌ ఎనిమిది ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా పెరిగింది. గత అకడమిక్‌‌ సంవత్సరంలో బీ–-స్కూల్స్‌‌ స్టూడెంట్స్‌‌కు ఇచ్చిన ఆఫర్లను కంపెనీలు తిరస్కరించలేదు. దాదాపు అందరికీ జాబ్స్‌‌ ఇచ్చాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఆఫర్ల లెటర్లను వెనక్కి తీసుకున్నాయి. ఇలాంటి స్టూడెంట్స్‌ కు ఇతర కంపెనీల్లో జాబ్స్ దొరికాయి. 2019–20లో మొత్తం 1,15,481 మందికి జాబ్స్‌‌ వచ్చాయి. మొత్తం 2.37 లక్షల మంది గ్రాడ్యుయేట్స్‌‌ క్యాంపస్‌‌ ప్లేస్‌‌మెంట్‌‌ కోసం ఎన్‌‌రోల్‌‌ చేసుకున్నారు.  వీరిలో చాలా మంది నాన్‌‌–ఐఐఎం స్కూల్స్ మేనేజ్‌‌మెంట్‌‌ గ్రాడ్యుయేట్స్‌‌. వీటి పనితీరు,బ్రాండ్‌‌ఇమేజ్ కారణంగా కంపెనీలు ఇందులోని స్టూడెంట్స్‌‌కు అవకాశాలు ఇచ్చాయి. ఐఐఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఏఐసీటీఈ కంట్రోల్‌‌లో ఉండవు. దరఖాస్తు చేసుకున్న వారిలో 49 శాతం మంది బి–స్కూల్‌‌ గ్రాడ్యుయేట్స్‌‌కు జాబ్స్‌‌ వచ్చాయని మేనేజ్‌‌మెంట్లు తెలిపాయి. 2012 తరువాత ఇంత ఎక్కువగా అవకాశాలు రావడం ఇదే తొలిసారని, కరోనా రాకుంటే మరింత ఎక్కువ మందికి  జాబ్స్‌‌ వచ్చేవని పేర్కొన్నాయి.

For More News..

దుబ్బాక ఎన్నికల్లో పోటీచేస్తే సజీవదహనం చేస్తాం

ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఆపలేదు

మీ ప్రైవసీకి భంగం కలగకుండా.. ‘దూస్రా’ నెంబర్

Latest Updates