తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్: వాతావరణ శాఖ

హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.  దీనికి  సంబంధించి హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారి రాజారావు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. అలాగే భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు ప్రమాదకర పరిస్థితికి చేరే అవకాశం ఉందని చెప్పారు.

మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.   హైదరాబాద్ కూడా భారీ వర్షాల కురిసే జోన్‌లో ఉందన్నారు రాజారావు.

Latest Updates