కుంభవృష్టి.. ముంబై, థానేలకు రెడ్ అలర్ట్

వరుసగా రెండోరోజు కూడా మహారాష్ట్రలోని ముంబై, థానే, పాల్ఘర్, రాయ్ గఢ్ జిల్లాల్లో భారీవర్షాలు ముంచిపడేశాయి. కుంభవృష్టి కారణంగా వరదలతో కాలనీలు మునిగిపోయాయి. మంగళవారం నాడు భారీ వర్షాల కారణంగా… బుధవారం నాడు ముంబైలో స్కూళ్లకు బంద్ ప్రకటించారు. బుధవారం ఉదయం 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతకు ముందు రోజున 13.1 సెంటీమీటర్ల అతి భారీవర్షం పడింది. బుధవారం నాడు రోజంతా ముంబై, థానే, రాయ్ గఢ్, పాల్ఘర్ లలో భారీవర్షాలు పడతాయంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వరకు మొత్తం ముంబైలో సగటున 11.09 సెం.మీ. వర్షం పడింది. తూర్పు ముంబైలో 13.1 సెం.మీ. వర్షపాతం కురిసింది. పశ్చిమ నగరంలో 14.5 సెం.మీ. రెయిన్ ఫాల్ నమోదైంది.

ముంబై నగరంలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయే సూచనలు ఉన్నట్టు అధికారులు అలర్ట్ ఇచ్చేశారు. పౌరులు అత్యవసరాలకు మాత్రమే రోడ్లపైకి రావాలని కోరారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ – ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్నాయి. కుర్లాలో 1వెయ్యి 3వందల మందిని ఇప్పటికే ముంపు ప్రాంతాలనుంచి … సేఫ్ క్యాంప్ లకు తీసుకెళ్లినట్టు అధికారులు చెప్పారు.

భారీవర్షం, వరదకు చాలా వరకు రైళ్లు రద్దయ్యాయి. సియాన్ రైల్వే స్టేషన్ లో ట్రాక్ మునిగిపోయింది. విఖ్రోలీ- కంజుర్ మార్గ్ రైల్వే లైన్ ను టెంపరరీగా మూసేశారు.

Latest Updates