ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

భారీ వర్షాలతో ముంబై నగరం నీట మునిగింది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో కాలనీలన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు ఎక్కడి కక్కడే నిలిచిపోయాయి. దీంతో పాఠశాలలు, కాలేజీలు సెలవు ప్రకటించాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దాంతో అధికారులు అలర్టయ్యారు.ముంబైతో పాటు రాయిగఢ్‌ జిల్లాలో కూడా వర్షాల ప్రభావం ఉంది. దీంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. సముద్ర తీర ప్రాంతంలోనూ, నీళ్లు భారీగా నిలిచిన ప్రదేశాలకు ప్రజలు వెళ్లకూడని హెచ్చరికలు జారీ చేశారు.

Latest Updates