పండుమిర్చి తింటే ఒబెసిటి దూరం…

red-chilli-remedy-for-fat-burning

ప్రస్తుత జీవన విధానంలో ఫ్యాట్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఊబకాయం తగ్గించుకోవడానికి ఇటు డాక్టర్ల చుట్టూ.. అటు హెల్త్ సెంటర్ ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. ఊబకాయం తగ్గించుకునేందుకు సూపర్ పరిష్కారాన్ని కనుగొన్నారు పరిశోదకులు. పండు మిర్చి  ఊబకాయానికి చక్కటి పరిష్కారం అని చెప్తున్నారు.

అమెరికాలోని వెర్మింటా పరిశోధకులు చాలా రిసెర్చ్ చేసిన తరువాత ఈ విషయాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఇందుకు గాను.. 16వేల మందిపై రిసెర్చ్ చేసినట్లు తెలిపారు. రోజూవారి ఫుడ్ లో పండుమిర్చిని భాగం చేసి తినే వారిలో గుండెకు సంబంధించిన రోగాలు, పక్షవాతం లాంటి డిసీజెస్ లు రావని తేల్చారు. పండు మిర్చిలో కేప్సెసిన్ అనే పదార్థం ఉంటుందని చెప్పారు. ఇది శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి హానికారక క్రీములను చంపేస్తుందని తెలిపారు. ఎండు మిర్చి వల్ల మానవ కణాలలో ఉండే TRP వ్వవస్థ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు.

Latest Updates