1990లో జరిగిన ఘటన.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్

విమాన ప్రయాణంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా విమానం టేకాఫ్ నుంచి ల్యాండ్ అయ్యేవరకు పైలెట్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

1990లో బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన పైలట్  టిమ్ ల్యాన్‌కాస్టర్ ఓ రోజు ఇంగ్లాండ్‌ నుంచి స్పెయిన్ కు విమానం నడుపుతున్నాడు. విమానం 22 వేల అడుగుల ఎత్తులో ఉండగా  పైలట్లు కుర్చొనే కాక్‌పీట్‌లోని ముందు అద్దం ఊడిపోయింది. గాలి తీవ్రతకు తట్టుకోలేక విమానం బయటకు వేలాడాడు. ఊడిన కాక్ పిట్ డోర్  ప్లైట్ అటెండెంట్ నిగెల్ ఒగ్డేన్‌కు తగిలింది. అయినా సరే పైలెట్ టీమ్ ను కాపాడాలని.. అటెండెంట్ నిగెల్  ప్రాణాలకు తెగించాడు. కిందపడ్డ నిగెల్ ఒక్క ఉదుటున లేచి పైలెట్ టిమ్ కాళ్లను పట్టుకున్నాడు.  పైలట్ కుర్చీకి ఉండే బెల్టును టిమ్ నడుముకు చుట్టాడు. ఇంతలో ఫ్లైట్ అటెండెంట్ తనని తాను బెల్టుతో పైలట్ సీటుకు కట్టేసుకున్నాడు.

అదే సమయంలో కో-పైలట్ అలిస్టైర్ అట్చిన్‌సన్  ఎంతో చాకచక్యంగా విమానాన్ని సౌత్అంప్టన్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. అనంతరం పైలెట్ టిమ్ కు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Latest Updates