చాన్నాళ్లకి చిల్: లాక్​డౌన్​ మూడ్​ నుంచి జనం రిఫ్రెష్​

గోల్కొండకు వీకెండ్స్​లో
వెయ్యి మందికిపైనే..
కేబుల్ బ్రిడ్జికి విజిటర్స్​ తాకిడి
పార్కుల్లో రిలాక్స్​ అవుతున్న జనం

‘‘మేం ఉండేది చిన్న ఇంట్లో. దాంతో డైలీ బాబును తీసుకుని పక్కనే ఉన్న కృష్ణకాంత్ పార్కుకి ఈవెనింగ్ వాక్​కి వెళ్తుంటా. లాక్ డౌన్​తో పార్కు క్లోజ్ అవడంతో ఎటూ వెళ్లడానికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ పార్క్​ ఓపెన్ చేయడంతో రిలీఫ్​ ఫీల్​ అవుతున్నాం’’ ‑  యూసుఫ్​గూడకి చెందిన మాధురి

‘‘లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. ఈ రోజు గోల్కొండ చూడ్డానికి వచ్చాం. హాయిగా ఉంది. కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.’’  ‑  వనిత, సంగారెడ్డి

హైదరాబాద్, వెలుగు :లాక్​డౌన్​తో కళ తప్పిన సిటీ ఇప్పుడు మళ్లీ మాములు స్థితికి చేరుకుంటోంది. గోల్కొండ ఖిలా, సిటీలోని పార్కులు, ఇతర స్పెషల్ ​స్పాట్స్​ జనంతో సందడిగా కనిపిస్తున్నాయి. రీసెంట్​గా ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దాదాపు 6 నెలల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గడపడం సంతోషంగా ఉందని సిటిజన్స్​ చెప్తున్నారు.

కోటలో తిరుగ అందాలు చూసేందుకు..

అన్ లాక్ 4లో భాగంగా సిటీలోని పార్కులతోపాటు గోల్కొండ కోటలోకి ఎంట్రీ దొరికింది. సిటీజనాలు బయటకు వెళ్లి సేద తీరేందుకు ఊరట లభించింది. సిటీలో గోల్కొండ కోట మాత్రమే ప్రారంభం కావడంతో సందర్శకుల తాకిడి ఎక్కువవుతోంది. సిటిజన్స్​తోపాటు చుట్టుపక్కల జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ వస్తున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి ఆన్​లైన్​బుకింగ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. డైలీ 700 నుంచి వెయ్యిమంది దాకా వస్తున్నారని ఖిలా ఇన్​చార్జి తెలిపారు. వీకెండ్స్ లో వెయ్యి నుంచి 1,500 వరకు తాకిడి ఉంటోందని చెప్పారు. చాలామందికి ఆన్​లైన్​బుకింగ్ గురించి తెలియకపోవడంతో నేరుగా కోట దగ్గరికి వస్తున్నారు. అప్పటికప్పుడు ఆన్​లైన్​లో బుక్ చేసుకుని లోపలికి వెళ్తున్నారు.

నేచర్ ని ఎంజాయ్ చేస్తూ..

సిటీలో పార్కులు ఎప్పుడూ జనంతో సందడిగా కనిపిస్తుంటాయి. జాగింగ్,  వాకింగ్​కి కూడా  పార్కులను ప్రిఫర్​ చేస్తుంటారు. ఫిట్​నెస్ కోసమే గాక స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం కోసం వెళ్తుంటారు.  ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ, కేబీఆర్, సంజీవయ్య, కృష్ణకాంత్ పార్కులకు చాలామంది పిక్ నిక్ లా పోతుంటారు. ఇప్పుడు అన్ లాక్​తో అవన్నీ ఓపెన్ అవడంతో మళ్లీ పార్కులకి వెళ్తున్నారు. ప్రేమికులు కూడా కనిపిస్తున్నారు.

కేబుల్ బ్రిడ్జి క్రేజ్..

సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జే. దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెనను చూసేందుకు జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్స్​లోనే సందర్శకులను ఈ బ్రిడ్జి మీదికి అనుమతిస్తున్నారు. ప్రారంభమైన మొదటి రెండ్రోజుల్లోనే ఇక్కడికి లక్షమందికిపైగా వచ్చారు. బ్రిడ్జి పైనుంచి చెరువు అందాలను చూస్తూ సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. ఫిజికల్​ డిస్టెన్స్, మాస్క్​లు మాత్రం చాలా వరకు కనిపించ లేదు. బ్రిడ్జి మీదికి ఎంతమందిని అనుమతించాలనే నిబంధన కూడా లేకపోవడంతో పెద్దసంఖ్యలో గ్యాదెర్ అవుతున్నారు.

ఇప్పుడిప్పుడే వస్తున్నారు..

సెప్టెంబర్ 1 నుంచి విజిటర్స్​ను అనుమతిస్తున్నాం. సిటీతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. వీకెండ్స్ లో 1,200 దాకా ఉంటున్నారు. విజిటర్స్ కి గైడ్స్ ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నా రు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా త్వరగా వెళ్తే మంచిదని చెప్తున్నాం. ‑ నవీన్​కుమార్, గోల్కొండ కోట ఇన్​చార్జి

హ్యాపీగా ఉంది

మేం ఉండేది అడ్డగుట్ట. 6నెలల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఎన్టీఆర్ గార్డెన్ కి వచ్చాం. బాబు చాలాసేపు ఆడుకున్నాడు. హ్యాపీగా ఉంది. లాక్​డౌన్​తో ఇన్నాళ్లూ ఇంట్లోనే ఉన్నాం. మాక్కూడా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వచ్చింది. ‑ వాణి, అడ్డగుట్ట

Latest Updates