ఏపీ బడ్జెట్ ను మించి హామీలు: పవన్

ఏపీ బడ్జెట్ రెండు లక్షల కోట్లుంటే.. 5 లక్షల కోట్ల హామీ లు ఇస్తున్నారని చంద్రబాబు, జగన్ లపై జన సేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.జనసేన పార్టీని స్థాపించకుండా ఉంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని అడ్డంగా దోచుకునేవని, అధికారంలో ఉన్నవారు 60 శాతం, ప్రతిపక్షంలో ఉన్నవారు 40 శాతం అంటూ రాయలసీమలో మాదిరి వాటాలు వేసి పంచుకునేవారని ఆరోపించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని కల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ” జనసేనకు ఒక్క శాతం ఓట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్ అంటున్నారు. అదే నిజమైతే జనసేన అనగానే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఉత్తరాంధ్ర లో భూములపై కొందరి కన్నుపడింది. ఎక్కడి నుంచో వచ్చి వేల ఎకరాలు కొంటున్నారు.పులివెం దుల నుం చి డబ్బు సంచులు తెచ్చి ఇక్కడ భూములు కొంటే మనకు ఉపాధి అవకాశాలు కూడారావు. పులివెందులకు వెళ్లి మనం ఒక్క ఎకరం భూమి కొనగలమా? మన భూముల్ని కొం టూ మనల్నే తొక్కేస్తుంటే ఊరుకుంటామా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం ఇప్పట్లో జరగదని, మినీ రిజర్వాయర్ల ద్వారా సాగుకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. సభావేదిక వద్ద మంటలు పవన్ కల్యాణ్ పాల్గొన్న ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభావేదిక వద్ద షార్ట్ సర్క్యూట్‌‌తో మంటలు చెలరేగాయి. దీంతో వేదిక నుంచి దిగి వాహనంపై ఎక్కి పవన్ ప్రసంగం కొనసాగించారు. రాష్ట్రం లో జరిగిన సభలకు ఎక్కడా ఇబ్బంది కలగలేదని, శ్రీకాకుళంలో మాత్రమే తన సభలకు అడ్డుపడుతున్నారని పవన్ ఆరోపించారు.

Latest Updates