రెజీనా కసాండ్రా.. ‘దోశ’ మై ఆల్​టైమ్​ ఫేవరెట్

రెజీనా కసాండ్రా… ఈ హీరోయిన్‌ పేరు చెప్పగానే ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ సినిమాలో సీత గుర్తొస్తుంది. అది పక్కా కమర్షియల్‌ సినిమా. ‘జ్యో అచ్యుతానంద’లో జ్యో గుర్తొస్తుంది. అదేమో పక్కా క్లాస్‌ సినిమా. ‘అ!’ సినిమా గుర్తొస్తుం ది. ఇది ఒక డిఫరెంట్‌ సినిమా. ఏ జానర్‌ సినిమా అయినా, ఎలాంటి పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించేస్తుం ది రెజీనా. మిడిల్‌ బడ్జెట్‌, చిన్న సినిమాలకు రెజీనా.. క్వీన్‌. నిన్న థియేటర్ల ముందుకొచ్చిన ‘ఎవరు’ సినిమాలో ఒక పవర్ఫుల్‌ రోల్‌లో కనిపించి మెప్పించిన రెజీనాతో ‘లైఫ్‌’ ఇంటర్వ్యూ. రెజీనా కెరీర్‌, పర్సనల్‌ ముచ్చట్లేంటో చూద్దాం..!

యాక్టింగ్ వైపు ఎప్పుడు, ఎలా వచ్చారు?

చాలా చిన్న వయసులోనే… అంటే నాలుగో తరగతిలో ఉన్నప్పుడే యాడ్స్ (మోడలింగ్) చేశాను. అలాగే కొన్ని సినిమాలు, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ‘శ్ప్లాష్ ’ అనే కి డ్స్ చా నెల్లో యాం కరింగ్ కూడా చేశాను. అప్పుడు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అనిపించిం ది. ‘ఓహ్ … నాలో కూడా ఏదో టాలెంట్ ఉంది’ అని. నాకు మొదట్నించీ మాట్లాడటం, దేని గురించైనా ఎక్స్ ప్లెయిన్ చేయడం, డ్ యాన్స్ అంటే ఇంట్రెస్ట్ . అందువల్లే నాకు యాక్టింగ్ , యాం కరింగ్ వైపు ఇష్టం పెరి గిందేమో.

‘రెజీనా కసాండ్రా’ పేరు గురించి… చాలా కొత్తగా, బాగుంటుంది కదా!

థ్యాం క్స్ . రెజీనా పేరుకు అర్థం ‘క్వీన్ ఆఫ్ ది హెవెన్ ’. అంటే ‘మేరీ మాత’ మీద భక్తితో నాకు ఆ పేరు పెట్టారు. కసాండ్రా ఎలా వచ్చిం దంటే… మా అమ్మ ఎక్కువగా నవలలు చదువుతారు. అలా ఒక రొమాంటి క్ నవలలో ఒక క్యారెక్టర్ పేరు కసాండ్రా. అది ఆమెకు బాగా నచ్చి ‘రెజీనా కసాండ్రా’ అని పెట్టారు.

డిగ్రీని ‘విమెన్స్ కాలే జీ ’లో చేశారు? దానికి పర్టిక్యులర్ రీజన్ ఉందా?

అలాంటిదేం లే దు. డిగ్రీ ఒక్కటే విమెన్స్ కాలేజీ లో చదివాను. దానికి ముందు స్కూలింగ్ , ప్లస్ వన్, ప్లస్ టూ… అన్నీ కో ఎడ్యుకేషన్ లోనే పూర్తి చేశాను. మా ఇంట్లో అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండేవి కావు. ఇంకా బయటవాళ్లే… ‘‘ఎందుకు మీ అమ్మాయిని కో– ఎడ్యుకేషన్ స్కూల్లో చదివిస్తున్నారు. బయట చాలా జరుగుతున్నాయి. వాటి గురించి మీకు తెలిసినట్టు లేదు ” అని అమ్మతో అనేవాళ్లు.

కానీ మా అమ్మ మాత్రం… ‘‘ప్రపంచంలో ఒక్క ఆడవాళ్లే లేరు కదా. ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ ఉంటారు. తనకి ప్రపంచం అంటే ఏంటో తెలియాలి. ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలు ఈ వయసులోనే క్లియర్ గా తెలుసుకోవాలి” అని సమాధానం చెప్పేది. అయితే నేను ‘విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ లో బీఎస్సీ (సైకాలజీ) చేశాను. దానికి కారణం విమెన్స్ కాలేజ్ అని కాదు… నాకు ఎంతో ఇష్టమైన సైకాలజీ డిపార్ట్ మెంట్ ఆ కాలేజీలో బాగుందని మాత్రమే అందులో జాయిన్ అయ్యాను.

ఈసారి ఇండిపెండెన్స్‌ డే, రాఖీ పండుగ.. రెండూ ఒకేసారి వచ్చాయి. మీ సినిమా కూడా అదే రోజు వచ్చేసింది. ఎలా ఉంది? ఈ పండుగలు మీరెలా సెలబ్రేట్‌ చేసుకుంటారు?

స్కూల్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్‌ డే, రిపబ్లిక్ డే కోసం ఎదురు చూసేవాళ్లం. ఉదయాన్నే లేచి, త్వరగా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్లేవాళ్లం . జెండా ఎగరేశాక ప్రోగ్రామ్స్ చేసి ఇంటికి రావడం బాగుండేది. ప్లస్ టూలో ఉన్నప్పుడు నేను స్కూల్ పీపుల్ లీడర్ గా ఉండేదాన్న. సో… రెస్పాన్సిబుల్ గా ఉంటూనే.. ఆ రోజును ఎంజాయ్ చేసేవాళ్లం . ఇండస్ట్రీకి వచ్చాక బిజీబిజీగా గడుస్తు న్నాయి రోజులు. అప్పటి రోజుల్ని చాలా మిస్ అవుతున్నా.

రాఖీ పండుగను ఒకప్పుడు నార్త్​ ఇండియాలో మాత్రమే చేసుకునేవాళ్లు. కానీ తర్వాతర్వాత సౌత్ ఇండియాకూ వచ్చేసింది. మేం ఇంట్లో పెద్దగా చేసుకోకపోయినా.. బయట హ్యాపీగా చేసుకునేదాన్ని. స్కూల్ డేస్ లో అయితే… ‘‘ఎక్కువ చేస్తే… రాఖీ కట్టేస్తాం ” అని బాయ్స్​ని బెదిరిం చేవాళ్లం . నాకు సొంత అన్నదమ్ములు లేకపోయినా .. బ్రదర్స్​గా చూసుకునే ‘కౌశిక్ ’, ‘అర్జున్ ’ అనే ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్​కి రాఖీ కట్టేదాన్ని. అప్పుడు వాళ్లు నాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్లు. ఈ ఫీల్డ్ కి వచ్చాక షూటింగ్ షెడ్యూల్స్​తో బిజీగా ఉండటం వల్ల, కట్టడం కుదరట్లేదు. కానీ ఎప్పుడూ ఫోన్ లో మాత్రం టచ్ లోనే ఉంటాం.

సెక్యులరిజం అంతా మీ ఇంట్లోనే కనిపిస్తోంది. ఎలా ఫీలవుతారు?

దానికి నేను చాలా ప్రౌడ్​గా ఫీలవుతా. నాకు తెలిసి.. ఎవరైనా వాళ్లకు నచ్చినట్లు ఉండొచ్చు. అప్పుడు అవతలి వాళ్లు దాన్ని గౌరవించాలి. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్లు ఏ కులం, ఏ మతం అనే ఆలోచన రాకుండా కలిసిమెలసి ఉండగలరు. అలాంటి విషయాలను నేను చిన్నప్పుడే నేర్చుకున్నా. ఎవరి ఆలోచనా విధానాన్ని తప్పుపట్టొద్దన్న విషయాన్ని త్వరగా గ్రహించా.

స్టడీస్​, యాక్టింగ్​.. రెండింటినీ ఎలా బ్యాలెన్స్​ చేశారు?

యాక్టింగ్​ అంటే ఎంత ఇష్టమో… సైకాలజీ అంతే ఇష్టం. అందుకే సైకాలజీ చదవాలన్న కోరిక కూడా అంతే గట్టిగా ఉండేది. అందుకే వచ్చిన ఆఫర్స్​ వదులుకోకుండా.. రెండింటినీ బ్యాలెన్స్​ చేశా. చాలా శ్రద్ధగా ఇటు మూవీస్​లో నటిస్తూనే నా గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశా.

మూవీస్​లో హీరోయిన్​ ఆఫర్స్​ ఎలా వచ్చాయి?

చాలా షార్ట్​ఫిల్మ్స్​ చేశాను కదా. అవి చూసి నన్ను సినిమా ఆడిషన్స్​కు పిలిచారు. అప్పుడు ఒకటే అనుకున్నా… ‘ఎవరికైనా అవకాశం వచ్చిందంటే… దానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది. దాన్ని మిస్​ చేసుకోవద్దు. ఎట్​లీస్ట్​ ట్రై చేయాలి’ అని. అలాగే ‘చూద్దాం… నాలో కూడా ఏదో టాలెంట్​ ఉందేమో, ఒక ఏడాది ట్రై చేద్దాం. ఒక సినిమా రిలీజ్​ అయ్యాక, జనం యాక్సెప్ట్​ చేయకపోతే, బ్యాడ్​ రివ్యూలు వస్తే… తిరిగొచ్చి సైకాలజీ చదువుదాం. తర్వాత అందులోనే ఎంఎస్ చేద్దాం లే’  అనుకున్నా. అలా 2012లో సుధీర్​బాబుతో కలిసి ‘ఎస్​ఎంఎస్​ (శివ మనసులో శృతి)’ మూవీ చేశాను. దాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఇంక అప్పుడు ఫిల్మ్స్​ కెరీర్​ని కంటిన్యూ చేయాలని డిసైడ్​ అయ్యాను.

ఎందుకు వరుసగా ‘ఎక్స్​పరిమెంటల్​’ మూవీస్​ చేస్తున్నారు.. ప్రత్యేకంగా కారణం ఏదైనా ఉందా?

ఎక్స్​పరిమెంటల్​ సినిమాలే చేయాలని ప్లాన్​ చేయట్లేదు. అప్పుడు కమర్షియల్​ మూవీ ఆఫర్స్​ వచ్చాయి. ఇప్పుడు ఇలా వస్తున్నాయి. వచ్చాయని మాత్రమే కాకుండా, స్టోరీ లైన్​ నచ్చుతోంది. అందుకే ‘అ!’, ‘ఎవరు’ మూవీస్​ చేశా. భవిష్యత్​లో కమర్షియల్​, లవ్​ స్టోరీస్​… ఇలా ఏ ఆఫర్​ వచ్చినా చేస్తా. యాక్టర్స్​ ఎప్పుడూ ‘ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి?’ అని కోరుకోరు. ఎలాంటి క్యారెక్టర్​ అయినా చేయగలగాలి.

‘ఎవరు’లాంటి సస్పెన్స్​ థ్రిల్లర్ చేయడం ఎలా అనిపించింది?

నా కెరీర్​లో నేను ఫిజికల్​గా, మెంటల్​గా 100% ఇచ్చిన మూవీగా దీన్ని చెప్తాను. ఇందులో డబ్బింగ్​ కూడా నేనే చెప్పుకున్నా. అంటే ఈ సినిమానే… నా నుంచి ఇంత కష్టాన్ని డిమాండ్​ చేసినట్టు అనిపిస్తుంది. ఒక యాక్టర్​గా ఈ సినిమా చేయడం చాలా శాటిస్​ఫైడ్​గా అనిపిస్తోంది.

ఎలాంటి ఫుడ్​ ఇష్టం?

నాకు ఫుడ్​ అంటేనే చాలా ఇష్టం. అందులో ‘దోశ’ మై ఆల్​టైమ్​ ఫేవరెట్​. అలాగే పెరుగన్నం​ నుంచి థాయ్​, జపనీస్​ వరకు అన్నింటినీ టేస్ట్​ చేస్తాను.

Latest Updates