విదేశీ విద్యకు సాయం

విదేశాల్లో పీజీ, పీహెచ్​డీ చదవాలను కునే మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఓవర్సీస్​ స్కాలర్​షిప్​ స్కీం ఫర్​ మైనారిటీస్ పథకం రిజిస్ట్రేషన్లు ప్రారంభ మయ్యాయి. సెప్టెంబర్​ 27 వరకు ఆన్​లైన్​లో అప్లైచేసుకోవచ్చు. ఈ పథకం కింద 500 మందికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్​లో స్టడీస్​ కోసం వెళ్లేవారు మాత్రమే అర్హులు. TOEFL/ IELTS/GRE/GMAT లో వ్యాలిడ్​ స్కోర్ కలిగి ఉండి ఫారెన్ వర్శిటీలో అడ్మిషన్ కన్ఫర్మ్​ అయిన సంవత్సరం లోపు జాయినై ఉండాలి. ఏటా ఆగస్టు/సెప్టెంబర్​, జనవరి/ఫిబ్రవరిలో రెండు సార్లు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు అవకాశముంది. మహిళలకు 33 శాతం స్కాలర్​షిప్స్​ కేటాయించారు.

అర్హత: ఇంజినీరింగ్​, మేనేజ్​మెంట్​, ప్యూర్ సైన్సెస్, అగ్రికల్చర్​ సైన్సెస్, మెడిసిన్​, సోషల్​ సైన్సెస్, హ్యూమానిటీస్​లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ లో ఉత్తీర్ణత  కలిగి ఉండాలి. వయసు 2019 జూలై 1 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఒక కుటుంబంలో ఒకరికే ఆర్థిక సాయం చేస్తారు. కుటుంబ ఆదాయం రెండు లక్షలకు మించకూడదు.

సెలెక్షన్​ ప్రాసెస్: మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ, టెక్నికల్​ ఎడ్యుకేషన్​ కమీషనర్​ తదితరులతో కూడిన స్టేట్ లెవెల్​ స్ర్కీనింగ్​ కమిటీ దరఖాస్తులను విశ్లేషించి లబ్దిదారులను ఎంపిక చేస్తుంది. సెలెక్ట్​ అయిన వారికి రూ.5 లక్షల చొప్పున రెండు ఇన్​స్టాల్​మెంట్లలో 10 లక్షల స్కాలర్​షిప్​ అందిస్తారు. వీరు 5 లక్షల వరకు ఎడ్యుకేషన్​ లోన్​ కూడా పొందొచ్చు. అభ్యర్థులు ఫండ్స్​ను ఏ విధంగా ఖర్చే చేశారో సంవత్సరం చివర యుటిలిటీ సర్టిఫికెట్​ను సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్లకు చివరితేది:2019 సెప్టెంబర్​ 27

వెబ్​సైట్:www.telanganaepass.cgg.gov.in

Latest Updates