రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సోమవారం నుంచి ఈ స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు వీలు కల్పించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సోమవారం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

కొత్త రెవెన్యూ చ‌ట్టం దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని రిజిస్ర్టేష‌న్ల శాఖ‌లకు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో తెలిపింది.  త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ఉంటాయని ప్ర‌క‌టించింది.

Latest Updates