మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు

రాష్ట్రంలో త్వరలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు   కొన్నినిబంధనలు తప్పని సరిగా పాటించాల్సి ఉంది. వాటిని  రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

అభ్యర్ధులు పాటించాల్సిన నిబంధనలు…

…కొత్త చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

…అభ్యర్థులు నామినేషన్‌కు ముందు రోజు బ్యాంకు ఖాతాను తెరిచి… ఎన్నికల ఖర్చును దాని ద్వారా నిర్వహించాలి.

…కార్పొరేషన్‌లో పోటీ చేసే  SC,ST,BC  అభ్యర్థులు రూ.2500, ఇతరులు రూ.5వేల డిపాజిట్ చెల్లించాలి.

..మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థి SC,ST,BC  అభ్యర్థులు రూ.1250, ఇతరులు రూ.2500 డిపాజిట్ చెల్లించాలి.

…వార్డు, డివిజన్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి సంబంధిత మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలో ఓటరుగా ఉండాలి.

…ప్రతిపాదించే వ్యక్తి మాత్రం ఆ వార్డులో ఓటరై ఉండాలి.

…21 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు అర్హులు.

…మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్‌గా ఉండకూడదు. అంతేకాదు మున్సిపల్ ఆస్తులను లీజ్ తీసుకోకూడదు. పురపాలికకు బకాయి ఉండకూడదు.

…మున్సిపాలిటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభాదాయక పదవులు చేపట్టకూడదు.

…తీసుకున్న అప్పు తీర్చలేని వ్యక్తిగా ప్రకటించుకున్న వారు పనికిరారు.

… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు.

…గతంలో పోటీ చేసి ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించి ఉండకూడదు. అనర్హత గడువు ముగియకున్నా పోటీ కుదరదు.

…నాలుగు కంటే ఎక్కువ నామినేషన్లు వేయకూడదు. ప్రతి నామినేషన్ పేపర్ పై సంబంధిత వార్డు నుంచి ఒక ఓటరు ప్రతిపాదకుడిగా సంతకం చేయాలి.

… SC,ST,BC లకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ విధిగా జత చేయాలి.

…నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి రూ.20 స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ను నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసినా ఒకదానికి డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.

…పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి బీ-ఫారం అందజేయాలి.

…ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు. వేర్వేరు వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేసినా ఒక వార్డులో మినహా ఇతర నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. రెండు, లేదా అంతకంటే ఎక్కువ వార్డుల్లో పోటీలో ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు.

Latest Updates