నువ్వు సింహమైతే నాకేంటి… నేను అంతకన్నా మొనగాన్ని

ఏం రా వారి.. ఏమనుకుంటున్నవ్​ రా నన్ను.. సింహం అనుకుంటున్నవా.. పిల్లి అనుకుంటున్నవా..

ఎహె.. నువ్వు సింహమైతే నాకేంటి.. నేను అంతకన్నా మొనగాడిని…… అన్నట్టు పోయిండు సింహం ఎన్​క్లోజర్​లోకి. దర్జాగా దాని ముందుకు  వెళ్లి నడుంపై చేతులు పెట్టుకుని నిలబడ్డడు. దాని మొహంల మొహం పెట్టి చూస్తూ మోకాళ్లపై కూర్చుండు. ఢిల్లీలోని జూలో జరిగిందీ ఘటన. వద్దు రా బాబూ అని తోటోళ్లు ఎంత మొత్తుకున్నా అతగాడు విన్లె. దాని దగ్గరకు పోయి కూర్చుండు. కాసేపైనంక చెట్టు కొమ్మెక్కి పండుకుండు. రా.. రా.. అంటూ సింహాన్ని పిలిచిండు. అదొచ్చి అతడి మీదికెక్కి కూసుంది. జూ అధికారులు వచ్చి అతగాడిని కాపాడిన్రు. ఆ వ్యక్తిని బీహార్​కు చెందిన రెహాన్​ ఖాన్​గా గుర్తించిన్రు. పోలీసులు అతడిని స్టేషన్​కు పట్టుకుపోయినరు.  ఆరా తీస్తే అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. నయం కాదు, సింహం కళ్లలో కళ్లు పెట్టి చూసి ప్రాణాలతో బయటపడ్డడు.

Latest Updates