ప్రేమతో గెలవండి..!: బంధం కంటే అవి ఎక్కువా?

జీవితం ఎవరితో పంచుకోవాల్సి వస్తదో తెలియదు. ప్రేమో, పెళ్లో ఇద్దరిని కలిసి బతకమని నిర్ణయిస్తది. ఆ ప్రయాణం మొదలు పెట్టా కే నిజంగా ఒకరి గురిం చి మరొకరు తెలుసుకుంటారు. ‘ఇద్దరం సమానమే’ అనుకుంటే ఓకే! కానీ..కాదనుకుంటే ఆ రిలేషన్‌ షిప్‌ బీటలు వారడం ఖాయం. ముఖ్యంగా జీవిత భాగస్వాముల మధ్య ‘పవర్‌ ’ సమానంగా లేనప్పుడు… ‘పవర్‌ ’ అంటే శాసించేది.. అది ఆస్తి, అంతస్తు, అందం, చదువు లాంటివన్నమాట. వీటిలో ఏది ఒకరి దగ్గర మాత్రమే ఉన్నా..హెచ్చు తగ్గులున్నా అది వివక్షకు దారి తీస్తది! ఈ ఆధిపత్యం బయటకు కనపడకున్నా..ఎన్నో బంధాలు తెగిపోవడంలో ఇవే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కన్నీరు, బాధ మాత్రమే మిగిల్చే రిలేషన్‌ షిప్‌ లో ఉండాలని ఎవరూ అనుకోరు. భాగస్వాములు ఇద్దరూ సమానమే. సమానమనే భావన ఇద్దరిలో కలగాలి. ఒకరి ఆలోచనలు, అభిప్రాయలు మరొకరితో భయం లేకుండా పంచుకోవాలి. ‘ నా అభిప్రాయాన్ని ఏకీ భవించాల’ని పోరు పెట్టకూడదు. దాన్ని హెల్దీ రిలేషన్‌ షిప్‌ అంటారు. ఇలా కాకుండా రిలేషన్‌ షిప్‌ లో రాజకీయాలు చేస్తే.. ఎండ్‌ కార్డు పడుతుంది.

భాగస్వాముల జీతాల్లో హెచ్చుతగ్గుల గురించి ఆలోచిస్తే.. అందం, పాపులారిటీ, సోషల్‌ స్టేటస్‌ , ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ , క్లాస్‌ స్ట్రక్చర్‌ , ఆస్తి, కులం, మతం.. వీటిలో ఏ ‘పవర్‌ ’ అయినా సరే రిలేషన్‌ షిప్‌ ని చేదుగా మార్చగలదు. ఇది ఏన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే, వీటి ప్రభావం ప్రస్తుత రిలేషన్‌ షిప్‌ ల్ లో పెరుగుతోందంటున్నారు నిపుణులు. ఒక్కరి దగ్గరే పవర్‌ ఉండటం…వాళ్లే ‘పవర్‌ ప్లే’ చేయడం వల్ల రిలేషన్‌ షిప్‌ లు దెబ్బతింటున్నా యి. సమాజం స్త్రీ పురుషులు సమానత్వం వైపు ప్రయాణిస్తున్న ఈ రోజుల్లో .. చాపకింద నీరులా ‘పవర్‌ స్ట్రక్చర్‌ ’ సమానత్వానికి సవాలుగా నిలబడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ‘పవర్‌ గ్యా ప్‌ ’ తీవ్రంగా ఉంది. నా ఆస్తి.. సంపాదన ఎక్కువ ప్రతి రిలేషన్‌ షిప్‌ లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

భాగస్వాముల్లో ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎక్కు వ సంపాదించే వాళ్ల దగ్గర, ఒక్కరే పని చేస్తే.. వాళ్ల దగ్గరే ఈ ‘పవర్‌ ’ ఉంటుంది. ఎక్కు వ సంపాదించేవాళ్లు తమకు తెలియకుండానే ‘ నేను సంపాదిస్తున్న’ అనే విధంగా మాట్లాడుతారు. ఇది భాగస్వామిని బాధపెట్టే విషయం. ఇలా పుట్టే గొడవలన్నీ ఇగోకు సంబంధించినవే. ‘ మీ పుట్టింటివాళ్లకేం ఉంది?’ అని భర్తలు.. ‘మీ అమ్మ నాన్నలేం ఇచ్చారు’ అని భార్యలు అనడం వంటి ఆస్తులు, అంతస్తులకు సంబంధించిన గొడవలు కూడా రిలేషన్‌ షిప్‌ ని బలహీన పరుస్తాయి. ఇప్పటికీ చాలా తక్కువ మంది స్త్రీలకు మాత్రమే ఆర్థిక స్వేచ్ఛ ఉంది. ఇది కూడా అసమానత్వానికి ప్రధాన కారణం. పితృస్వామ్య విధానాల వల్లే ఇలా జరుగుతోంది. ఆర్థిక పరమైన శక్తి భాగస్వాములిద్దరికి సమానంగా ఉంటే..సమానత్వం వైపు అడుగులు పడతాయి.

చదువుతో కూడా..

అజ్ఞానాన్ని తొలిగించుకోవడానికే చదువుకుంటారు. కానీ, ‘నువ్వు పదే చదివావు.. నేను పీజీ చేశాను’ అని వివక్షపూరిత మాటలు అంటూ అజ్ఞా నాన్ని బయట పెట్టుకుంటారు. భాగస్వాములుల్లో ఎక్కువ చదివిన వాళ్లకు ‘పవర్‌ ’ ఉంటుంది. రిలేషన్‌ షిప్‌ లో వీళ్లే అధిపత్యం ప్రదిర్శిస్తుంటారు. చాన్స్‌ వచ్చిన ప్రతిసారీ చదువు గురించి రాజకీయం మొదలుపెడ్తారు. ఇది చిన్న విషయంగానే అనిపిస్తున్నా.. చిలికి..చిలికి దీర్ఘకాలంలో గొడవలకు.. తర్వాత బ్రేకప్‌ కి దారి తీస్తుంది. సోషల్‌ లైఫ్‌ భాగస్వామిలో ఒకరి శారీరక రూపురేఖలు, పాపులారిటీతో మంచి సోషల్‌ లైఫ్‌ ఉండటం వల్ల మరొకరు అభద్రతాభావానికి గురవుతారు. భాగస్వామిలో ఆకర్షణీయమైన వ్యక్తి దగ్గర ‘పవర్‌ ’ ఉండటం వల్ల అవతలి వ్యక్తిపైన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లినప్పుడు, ఎవరైనా అందం గురించి పొగిడినప్పుడు.. తన భాగస్వామి పై ‘పవర్‌ ప్లే’ మొదలు పెడతారు. తన పార్ట్‌‌నర్‌ ని తక్కు వ చేస్తూ అవతలి వ్యక్తితో సరదాగా ఉంటూ నొక్కి నొక్కి జోకులు వేస్తారు. ఇలా చెయ్యడం రిలేషన్‌ షిప్‌ పై అసంతృప్తిని వ్యక్తపరచడమే.

కుల మతాలు..

మతం, రాజకీయ విలువలు, నమ్మకాలు కూడా రిలేషన్‌ షిప్‌ పై ప్రభావం చూపిస్తాయి.  వేరు వేరు కులాలు లేదా మతాల వాళ్లు బంధంలో ఉన్నప్పుడు ఈ ‘పవర్‌ పాలిటిక్స్‌ ’ బంధాన్ని దెబ్బ తీస్తాయి. రిలేషన్‌ షిప్‌ లో అడుగు పెట్టిన కొన్నాళ్ల తర్వాత భాగస్వామిలో ఎవరో ఒకరు.. ‘ మాది గొప్ప కులం లేదా గొప్ప మతం’ అని ఇగోతో మాట్లాడతారు. భాగస్వాముల్లో సమాజంలో పెద్ద కులం అని భావించేవాళ్ల దగ్గర ‘పవర్‌ ’ ఉంటుంది. వీళ్ల ‘పవర్‌ ప్లే’నే రిలేషన్‌ షిప్‌ దెబ్బతినడానికి కారణమవుతుంది.

ఇంకా ఎన్నో!

భాగస్వాముల్లో ఇద్దరికీ వేరు వేరు రాజకీయ, సామాజిక భావజాలం ఉన్నప్పుడు కూడా సహజంగానే రిలేషన్‌ షిప్‌ లో సమస్యలు తలెత్తు తాయి. ‘పవర్‌ ’ ఉన్న వాళ్లు‌‌ తన అభిప్రాయంతో ఏకీభవించే వరకు భాగస్వామి తో ‘పవర్‌ ప్లే’ కొనసాగిస్తారు. ఈక్రమంలో గొడవలు జరుగుతాయి. శృంగార అభిరుచులు, ప్రాధాన్యతలు ‘పవర్‌ ప్లే’కు కారణమై.. రిలేషన్‌ షిప్‌ ఎటువైపు సాగాలనే దానిపై ప్రభావం చూపిస్తాయి. రిలేషన్‌ షిప్‌ లో శారీరకంగా బలహీనంగా ఉన్నవాళ్లకు కచ్చితంగా హాని జరిగే అవకాశం ఉంటుం ది. ఇందులో ప్రధానంగా స్త్రీలే శారీరక హింసకు, వేధింపులకు గురవుతారు. ఎందుకంటే అధిక శాతం పురుషులు శారీరకంగా బలంగా ఉంటారు. సంతానం కలగనప్పుడు కూడా స్త్రీలే ‘పవర్‌ ప్లే’ బాధితులుగా మారతారు. వీటితో పాటు.. కృత్రిమ ఆనందాలు, ఇష్టాలు, వ్యక్తిత్వం వంటివెన్నో రిలేషన్‌ షిప్‌ లో ఉన్న అసమానత్వానికి మూలాలు. అయితే, మోడ్రన్‌ రిలేషన్‌ షిప్‌ ల్ లో సైతం భాగస్వామి వ్యక్తిత్వమే పైన చెప్పిన అన్ని సమస్యలకు, ఆధిపత్యధోరణులకు కారణం!

Latest Updates