సూర్యాపేటలో దారుణం : ఇన్సురెన్స్ డబ్బు కోసం హత్య

ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ వ్యక్తిని హతమార్చారు బంధువులు. బొలెరో వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.  సోదరుడి కుమారుడే ఈ హత్యకు పాల్పడ్డ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో జరిగింది.

సీఐ శివశంకర్ గౌడ్ చెప్పిన వివరా ప్రకారం.. ముంజల రమేశ్ అనే వ్యక్తికి రెండు లారీలు ఉన్నాయి. అయితే లారీలతో నష్టాలు వచ్చాయి. ఫైనాన్స్ వాళ్లు లారీలు తీసుకెళ్లారు. దీంతో లోన్ల ద్వారా లారీలు కొనడంతో అప్పులు పెరిగిపోయాయి. బాకీల వాళ్లు అప్పులు తీర్చమని ఒత్తిడి తెచ్చారు. దీంతో పక్కా ప్లాన్ వేసిన రమేష్ ఒంటరి వాడైన తన బాబాయి సైదులు(30) పేరుతో రూ.50లక్షల ఇన్సురెన్స్ చేయించాడు.  తన బాబాయ్ ని చంపేసి ఇన్సురెన్స్ డబ్బులతో అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ లో బాగంగానే తన బాబాయ్ ను చంపేందుకు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరి సహాయం తీసుకున్నాడు.  ఇన్సురెన్స్ డబ్బులు రాగానే చెరో రూ.5 లక్షలు ఇస్తానని వారిని ఒప్పించాడు. దీంతో జనవరి 24న  తన బాబాయ్ ను బొలెరో వాహనంలో తీసుకెళ్లి మద్యం తాగించారు.  తర్వాత హైవే పక్కన బొలెరోతో ఢీకొట్టి హత్య చేసి వెళ్లిపోయారు. మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు  ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా జులాయిగా తిరిగే సైదులు పేరు మీద రూ.50లక్షల ఇన్సురెన్స్ ఎవరు చేయించారనే కోణంలో దర్యాప్తు చేసి సైదులు అనే వ్యక్తిని మునగాల సైదులతో పాటు మరో ఇద్దరిని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

see more news

కేంద్రం రాష్ట్రాలకు సహకరించడం లేదు

రావాలి జగన్ కావాలి జగన్ అని..జైలు పిలుస్తుంది

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన AR రెహ్మాన్

Latest Updates