జమ్ములో కర్ఫ్యూ సడలింపు

జమ్ము: పుల్వామా దాడి తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా జమ్ములో కర్ఫ్యూ విధించారు. ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిగడంతో ఆ రోజు సాయంత్రమే ఉన్నతాధికారులు  ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటికి నాలుగు రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. అప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ లో ఉన్నాయి. అయితే ప్రజలు నిత్యవసరాలకు ఇబ్బంది పడకుండా సోమవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. పాలు, కూరగాలయలు, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు వీలుగా కర్ఫ్యూ సడలించారు. దక్షిణ జమ్ము ప్రాంతంలో సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్లు జమ్ము డిప్యూటీ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. అయితే డిగ్యానా, బలీచరణ సహా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సడలింపు ఇవ్వలేదని తెలిపారు.

Latest Updates