బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మార్గదర్శకాలు విడుదల 

న్యూఢిల్లీ: బర్డ్ ఫ్లూ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ & సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు విడుదల చేసింది. బర్ద్ ఫ్లూ వైరస్ 70° డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 3 సెకన్లలో  చనిపోతుందని వెల్లడించింది. మాంసం, గుడ్లు 74° డిగ్రీల సెంటీగ్రేడ్  వద్ద ఉడికించినట్లయితే వైరస్ చనిపోతుందని స్పష్టం చేసింది. ఈ రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై ఆధారపడిన వ్యాపారవేత్తలు, వినియోగదారులు ఎవరూ భయపడవద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ భరోసా ఇచ్చింది. సరైన పద్దతులను అవలంబించాలని విజ్ఞప్తి చేసింది. వ్యాపారవేత్తలు, వినియోగదారులు ఏమి చేయాలో.. ఏమి చేయకూడదనే దాని గురించి మార్గదర్శకాలలో వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చింది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు,  అపోహలను తొలగించేందుకు ఏమి చేయాలో..  ఏమేమీ చేయకూడదో సవివరంగా తెలియజేసింది ఫుడ్ సేఫ్టీ&సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో టాస్క్ ఫోర్స్ కమిటీలను వేసి అన్ని కోళ్ల ఫారాలు.. ఇతర పక్షి, జంతు కేంద్రాలను పశు వైద్య నిపుణులు, వైద్య విద్యార్థులు తనిఖీలు చేస్తున్న నేపధ్యంలో మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఏమి చేయాలి.. ? ఏమి చేయకూడదు..?

Latest Updates