ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ను  ప్రకటించారు. మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్‌ 7నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఏప్రిల్ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఒకేషనల్‌ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

Latest Updates