టెన్నిస్‌ ప్లేయర్ ఫెదరర్‌ చిత్రంతో నాణెం విడుదల

టెన్నిస్‌ ప్లేయర్ రోజర్‌ ఫెదరర్‌కు అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఆయన ముఖచిత్రంతో నాణెం విడుదల చేయనున్నది. ఎన్నో రికార్డులను సొంత చేసుకున్న ఫెదరర్‌ గౌరవార్థం స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఈ కాయిన్ ను విడుదల చేయనున్నది. వచ్చే జనవరి నెలలో 20 స్విస్‌ ఫ్రాంక్‌ల  సిల్వర్ కాయిన్ ను విడుదల చేయనున్నారు. ఒక వ్యక్తి బతికి ఉండగా అతడి చిత్రంతో నాణెం విడుదల చేయడం ఇదే మొదటి సారి అని స్విట్జర్లాండ్‌ మింట్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

 

Latest Updates