రైతుబంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదలయ్యాయి. రూ. 333.29 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.  దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి 2019-20లో రైతుబంధు పథకానికి రూ.1683.90 కోట్లు విడుదలయ్యాయి.

రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఖరీఫ్, రబీ సీజన్ లో రూ.5వేల చొప్పున ఒక్కో ఎకరానికి మొత్తం 10 వేల రూపాయలు అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Latest Updates