రేపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవాటిక్కెట్లను  తిరుమల తిరుపతి దేవస్థానం రేపు( శుక్రవారం) విడుదల చేయనుంది. జులై నెలకు సంబంధించి వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను  www.tirumala.org  వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 10 గంటల నుంచి  భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను డిప్‌ విధానం కింద భక్తులను ఎంపిక చేయనుంది. విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లు కరెంటు బుకింగ్‌ కింద వెంటనే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. సేవాటిక్కెట్లన్నీ కలిపి దాదాపు 50 వేలకుపైగా విడుదల చేయనుంది టీటీడీ.

 

 

Latest Updates