త్వరలో జియో 5జీ ట్రయల్స్: ముఖేశ్ అంబానీ

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 43వ యానువల్ జనరల్ మీటింగ్‌ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ షేర్‌‌హోల్డర్స్‌ను ఉద్దేశించి అంబానీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ రూ.33,737 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేయనుందని ఆయన ప్రకటించారు. కంపెనీ జియో టీవీ ప్లస్, జియో గ్లాస్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు జియో మార్ట్, జియో 5జీ సొల్యూషన్‌పై అంబానీ పలు విషయాలు మాట్లాడారు.

‘జియో 5జీ సొల్యూషన్‌ను పూర్తిగా డెవలప్ చేసింది. దీని వల్ల ఇండియాలో ప్రపంచ స్థాయిలో 5జీ సేవలను లాంచ్ చేసే అవకాశం ఏర్పడింది’ అని అంబానీ పేర్కొన్నారు. అతి త్వరలో 5జీ సేవలకు సంబంధించిన ట్రయల్స్ మొదలవుతాయని చెప్పారు. వచ్చే ఏడాదికి ఫీల్డ్‌ డెవలప్‌మెంట్‌కు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విజన్‌ను జియో 5జీ సాకారం చేస్తుందని వివరించారు.

Latest Updates