ఉద్యోగుల వేతనాల్లో కోత: రిలయన్స్ ఇండస్ట్రీస్

కరోనా సంక్షోభం ప్రభుత్వాలతో పాటు అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. లాక్ డౌన్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.ఉద్యోగుల సాలరీల్లో 10 నుంచి 50 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది.

వార్షిక వేతనం రూ.15 లక్షలు కన్నా తక్కువ ఉన్నవారికి కోతలు వర్తించవని సంస్థ తెలిపింది. రూ.15 లక్షల కంటే ఎక్కువ జీతాలు ఉంటే 10 శాతం కోత, బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, సీనియర్ లీడర్ల సాలరీల్లో 30 నుంచి 50 % కోత అమలు చేయనున్నారు.

ఏడాదికి రూ.15 కోట్ల వరకు సాలరీ అందుకునే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన వార్షిక వేతనాన్ని పూర్తిగా వదులుకోనున్నారట.

Latest Updates